ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Telangana CM KCR : 'రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బ తీసేలా ఏపీ వ్యవహరిస్తోంది'

By

Published : Jul 6, 2021, 10:58 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్​ అధ్యక్షతన కృష్ణా జలాల అంశంపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర నీటి వాటా రాబట్టుకోవాలని ఇప్పటికే కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నట్లు గుర్తు చేశారు. జలవిద్యుదుత్పత్తి కొనసాగించాలని నిర్ణయించామన్నారు.

Chief Minister KCR
తెలంగాణ సీఎం కేసీఆర్​

తెలంగాణ సీఎం కేసీఆర్​ అధ్యక్షతన కృష్ణా జలాల అంశంపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. నదీ జలాల్లో రాష్ట్ర సాగునీటి వాటాను హక్కుగా పొందే వ్యూహంపై చర్చించారు. అనుసరించాల్సిన వ్యూహం, ఎత్తుగడలపై అధికారులకు మార్గనిర్దేశం చేశారు.

తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని వేదికపై రాజీలేని పోరాటం చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్ర రైతుల ప్రయోజనాలు దెబ్బతినేలా ఏపీ వైఖరి ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర నీటి వాటా రాబట్టుకోవాలని ఇప్పటికే కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నట్లు గుర్తు చేశారు. జలవిద్యుదుత్పత్తి కొనసాగించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

ట్రైబ్యునల్స్, కోర్టుల్లో తెలంగాణ వాణి బలంగా వినిపించాలని సీఎం అన్నారు. పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ వాణి బలంగా వినిపించాలని ఎంపీలకు సూచించారు. రాష్ట్ర నీటి వాటాపై పలు సందర్భాల్లో కేంద్రంపై ఒత్తిడి తెచ్చామని తెలంగాణ సీఎం వెల్లడించారు.

ఇదీ చదవండి:విశాఖ: అనకాపల్లి వద్ద కూలిన నిర్మాణంలో ఉన్న వంతెన.. ఇద్దరు మృతి

ABOUT THE AUTHOR

...view details