ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కర్నల్ సంతోష్​బాబు కుటుంబసభ్యులకు చంద్రబాబు పరామర్శ

By

Published : Jun 21, 2020, 4:30 PM IST

కర్నల్ సంతోష్‌బాబు కుటుంబసభ్యులను తెదేపా అధినేత చంద్రబాబు ఫోన్‌లో పరామర్శించారు. ఆయన ఆత్మత్యాగం తెలుగు వారందరికీ గర్వకారణమన్నారు.

chandrababu phone to santhosh family
కర్నల్ సంతోష్ బాబు​ కుటుంబసభ్యులకు చంద్రబాబు పరామర్శ

కర్నల్ సంతోష్​బాబు కుటుంబ సభ్యులకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఫోన్ చేసి పరామర్శించారు. దేశం కోసం ప్రాణాన్నే త్యాగం చేసిన ధన్యజీవి సంతోష్​ అని కొనియాడారు. అమరవీరుడి ఆత్మత్యాగం తెలుగు వారందరికీ గర్వకారణమని.... భరత మాత ముద్దుబిడ్డ సంతోష్ అని కీర్తించారు.

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు స్ఫూర్తిదాయకుడిగా సంతోష్ నిలిచాడని చంద్రబాబు పేర్కొన్నారు. సంతోష్‌బాబు మృతి ఆయన కుటుంబానికి తీరని లోటని...దానిని మరచి భవిష్యత్ వైపు సాగిపోవాలని చంద్రబాబు ధైర్యం చెప్పారు.

ఇవీ చదవండి:'వైకాపా ఎమ్మెల్యేలతో రఘురామకృష్ణరాజుకు ప్రాణహాని ఉంది'

ABOUT THE AUTHOR

...view details