ఆంధ్రప్రదేశ్

andhra pradesh

CBN: 'పీఆర్​సీ జాడే లేదు..సీపీఎస్ రద్దు ఊసే లేదు '

By

Published : Jul 14, 2021, 8:22 PM IST

Updated : Jul 14, 2021, 9:04 PM IST

ప్రభుత్వ ఉద్యోగులంటే జగన్​రెడ్డికి ఎందుకంత చులకనని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. కేంద్రప్రభుత్వం ఉద్యోగులకు 11 శాతం డీఏ ఇస్తుంటే..రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం 7 డీఏలను పెండింగ్​లో పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబు నాయుడు
చంద్రబాబు నాయుడు

ప్రభుత్వ ఉద్యోగులంటే జగన్​రెడ్డికి ఎందుకంత చులకన అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు 11శాతం డీఏ ప్రకటించిందన్న చంద్రబాబు.. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ఎప్పుడు లేనివిధంగా 7 డీఏలు పెండింగ్​లో పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పీఆర్సీ ఊసేలేదని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో రద్దు చేస్తానన్న సీపీఎస్ జాడలేదని విమర్శించారు. కరోనా విపత్తు సమయంలోనూ ప్రాణాలకు తెగించి పోరాడుతున్న ఉద్యోగుల విషయంలో ప్రభుత్వ దాటవేత ధోరణి సరికాదని హితవు పలికారు.

ఇదీ చదవండి:

jagan bail: 'జగన్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌'పై.. కీలక పరిణామం!

Last Updated : Jul 14, 2021, 9:04 PM IST

ABOUT THE AUTHOR

...view details