ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'12 గంటల ఇసుక దీక్షకు తరలిరావాలి'

By

Published : Nov 11, 2019, 9:41 PM IST

తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు.. రాష్ట్ర ప్రజానీకానికి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై అఖిలపక్షాలు ఐక్యంగా పోరాటం చేస్తున్నట్టే.. రాష్ట్రంలో ఇసుక సమస్యపై పోరాటానికి అంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు.

రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు బహిరంగ లేఖ

రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు బహిరంగ లేఖ

జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఇసుక విధానాన్ని మార్చిన కారణంగానే... చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కృత్రిమ కొరత ఏర్పడిందని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఈ నెల 14న విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద చేపట్టనున్న 12 గంటల ఇసుక నిరసన దీక్షకు అంచా తరలిరావాలని పిలుపునిస్తూ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. 30 లక్షల మంది కార్మికులు ఆకలితో అలమటించే పరిస్థితి కల్పించారంటూ ప్రభుత్వ తీరును చంద్రబాబు తప్పుబట్టారు. ఇసుక కొరతతో 40 మంది ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పని చూపే వరకు భవన నిర్మాణ కార్మికులకు 10 వేల రూపాయల భృతిని ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 12 గంటల ఇసుక దీక్షకు ఇప్పటికే అనేక పార్టీలు మద్దతు ప్రకటించాయని తెలిపారు.

రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు బహిరంగ లేఖ
sample description

ABOUT THE AUTHOR

...view details