ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఎన్నికల్లో ఓడిపోతారన్న భయంతోనే వైకాపా దాడులకు పాల్పడుతోంది: చంద్రబాబు

By

Published : Mar 8, 2021, 7:48 AM IST

పురపాలక ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే.. వైకాపా దాడులకు తెగబడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. విశాఖ జిల్లా 56న వార్డులో.. తెదేపా అభ్యర్థిపై వైకాపా నాయకులు చేసిన దాడిని ఆయన ఖండించారు.

chandrababu condemn attack on tdp leader at vishakapatanam
ఎన్నికల్లో ఓడిపోతారన్న భయంతోనే వైకాపా దాడులకు పాల్పడుతోంది: చంద్రబాబు

విశాఖపట్నంలోని 56వ వార్డులో కార్పొరేటర్​గా పోటీ చేస్తున్న తెదేపా అభ్యర్థి రాజశేఖర్​పై.. వైకాపా నాయకులు చేసిన దాడిని తెదేపా అధినేత చంద్రబాబు ఖండించారు. ఓటమి భయంతోనే వైకాపా దాడులకు తెగబడుతోందని మండిపడ్డారు. వైకాపా పాల్పడుతున్న దాడులపై ఎస్ఈసీ తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజశేఖర్ పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలన్నారు. పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఎస్ఈసీ, పోలీసులు రక్షణ కల్పించాలన్నారు. ఏబీసీడీ పాలనా విధానంతో.. జగన్ రెడ్డి విశాఖలో ప్రశాంత వాతావరణాన్ని చెడగొడుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

TAGGED:

ABOUT THE AUTHOR

...view details