ఆంధ్రప్రదేశ్

andhra pradesh

CBN REVIEW: మినీ మహానాడుపై చంద్రబాబు సమీక్ష.. మదనపల్లి తర్వాతే గుడివాడ

By

Published : Jun 29, 2022, 8:05 PM IST

CBN REVIEW: వచ్చే నెల 6, 7, 8వ తేదీల్లో రాయలసీమలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు పర్యటన యథాతథంగా కొనసాగనుంది. మహానాడు నిర్వహణపై పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్​లో కృష్ణా జిల్లా , మదనపల్లి నేతలతో సమీక్ష నిర్వహించారు. మదనపల్లి తర్వాత గుడివాడలో మహానాడు నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించారు.

CBN REVIEW
CBN REVIEW

CBN REVIEW:జులై 6, 7, 8వ తేదీల్లో రాయలసీమలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు పర్యటన యథాతథంగా కొనసాగనుంది. 6వ తేదీన అన్నమయ్య జిల్లాలో మదనపల్లిలో జరిగే తెదేపా మినీమహానాడులో పాల్గొననున్నారు. 7న పీలేరులో అన్నమయ్య జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలపై సమీక్ష నిర్వహించనున్నారు. 8వ తేదీన నగరి, జీడీ నెల్లూరులో చంద్రబాబు రోడ్ షో నిర్వహించనున్నారు. మహానాడు నిర్వహణపై పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్​లో గుడివాడ, మదనపల్లి నేతలతో సమీక్ష నిర్వహించారు. జూలై 6వ తేదీన మహానాడు తమ వద్దే జరపాలని మదనపల్లి, గుడివాడ నేతలు పట్టు బట్టారు. మదనపల్లిలో మహానాడు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నందున ఇప్పుడు వాయిదా వద్దని ఆ ప్రాంత నేతలు కోరారు. మదనపల్లి తర్వాత గుడివాడలో మహానాడు నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించారు.

ABOUT THE AUTHOR

...view details