ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సంబరాల సంక్రాంతికి.. సొంతూళ్లకు జనాల పయనం

By

Published : Jan 11, 2021, 7:02 AM IST

సంక్రాంతికి.... జనం సొంతూళ్ల బాట పడుతున్నారు. కరోనా ప్రభావం మొదలైన దగ్గర్నుంచి పది నెలలుగా అంతంతమాత్రం రద్దీతో ఉన్న ప్రయాణ ప్రాంగణాలు.... తిరిగి కిటకిటలాడుతున్నాయి. ప్రయాణికుల కోసం ఆర్టీసీ, రైల్వేశాఖ ప్రత్యేక సర్వీసులు నడుపుతూ వారిని గమ్య స్థానాలకు చేరవేస్తున్నాయి. వాహనాలన్నీ రోడ్డెక్కుతుండటం వల్ల ట్రాఫిక్ రద్దీ క్రమంగా పెరిగింది.

heavy crowd at Travel campuses
సొంతూళ్ల పయాణం.. కిటకిటలాడుతున్న ప్రయాణ ప్రాంగణాలు

సొంతూళ్ల పయాణం.. కిటకిటలాడుతున్న ప్రయాణ ప్రాంగణాలు

సంబరాల సంక్రాంతిని సొంతూళ్లల్లో ఆత్మీయుల మధ్య చేసుకునేందకు.... ప్రజలు పల్లెబాట పడుతున్నారు. ఉద్యోగం, చదువు, వేర్వేరు పనుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారంతా కుటుంబాలతో సహా స్వస్థలాలకు బయల్దేరుతున్నారు. ఏపీఎస్ఆర్టీసీ నడిపే రెగ్యులర్‌ సర్వీసుల్లో సీట్లన్నీ పది రోజుల ముందే బుక్ చేసుకున్నారు. దీంతో ప్రయాణికుల కోసం ఆర్టీసీ 3 వేల 607 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. వచ్చిపోయే వారితో బస్టాండ్ ప్రాంగణమంతా రద్దీ నెలకొంది. వాహనాలన్నీ రోడ్డెక్కుతుండటం వల్ల ట్రాఫిక్ రద్దీ క్రమంగా పెరిగింది.

మూస్కు ఉంటేనే అనుమతి..

కరోనా దృష్ట్యా మాస్కులు ధరించిన వారిని మాత్రమే అధికారులు ప్రయాణానికి అనుమతిస్తున్నారు. కొవిడ్ వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను మైకుల ద్వారా తెలియజేస్తున్నారు. విజయవాడ నుంచి ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాలకు ఎక్కువ మంది వెళ్తునందున ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు సర్వీసులు నడుపుతున్నట్టు అధికారులు తెలిపారు.

ప్రత్యేక రైళ్లు..

రద్దీ దృష్ట్యా రైల్వే శాఖ సైతం..... హైదరాబాద్, ముంబై, చెన్నై, బెంగళూరు నుంచి పలు ప్రాంతాల మీదుగా ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. దీంతో రైల్వేస్టేషన్లలోనూ గణనీయంగా రద్దీ పెరిగింది.

ఇదీ చూడండి:

ఉత్సాహంగా జాతీయస్థాయి ఒంగోలు జాతి వృషభరాజాల పోటీలు

ABOUT THE AUTHOR

...view details