ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అది అందమైన అబద్ధం.. వాళ్లు జగన్​ను నమ్మరు: అచ్చెన్న

By

Published : Aug 7, 2022, 6:09 PM IST

రాష్ట్రంలో కొనసాగుతున్నంత చెత్త పాలన చరిత్రలోనే లేదని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఉద్యోగుల జీతాలను ప్రతినెలా ఆలస్యంగా చెల్లిస్తూ.. సాంకేతిక సమస్య అంటున్నారని ఎద్దేవా చేశారు. ఉద్యోగులు ఇక సీఎం జగన్​ను నమ్మే పరిస్థితిలేదని అన్నారు.

ఆ పదం అందమైన అబద్ధం
ఆ పదం అందమైన అబద్ధం

ఉద్యోగులు ముఖ్యమంత్రి జగన్​ను నమ్మే పరిస్థితిలేదని.. తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ప్రతినెలా జీతాలు ఆలస్యంగా చెల్లిస్తూ సాంకేతిక సమస్య అని తప్పించుకుంటున్నారని మండిపడ్డారు. జగన్ అసమర్ధతకు ఆర్థిక శాఖ అధికారులు మూడేళ్లుగా అద్దిన అందమైన అబద్ధం 'సాంకేతిక సమస్య' అని ఎద్దేవా చేశారు. అది నిజమే అయితే మూడేళ్లుగా సాంకేతిక సమస్యలు పరిష్కరించలేకపోవటం అసమర్థత కాదా? అని ప్రశ్నించారు.

ఉద్యోగులు ఆ పదం వినీవినీ అలసి పోయారన్న అచ్చెన్న.. ఇక నమ్మే పరిస్థితి లేదన్నారు. గత ప్రభుత్వంలో మొదటి తారీఖునే జీతాలు పడేవని.. నెలవారీ ఈఎంఐలు ఆలస్యం కాకుండా చెల్లించేవారని గుర్తు చేశారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక మొదటి తారీఖున జీతాలు రావటం గగనమైపోయిందన్నారు. అకౌంట్లలో పడ్డ సొమ్ము కూడా తిరిగి మాయమయిపోవటం సర్వ సాధారణం అయిపోయిందని ఎద్దేవా చేశారు. ఇంత చెత్త పాలన చరిత్రలో లేదని అచ్చెన్న విమర్శించారు.

ఇవీ చూడండి

ABOUT THE AUTHOR

...view details