ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సెప్టెంబరు 1న కలెక్టరేట్ల వద్ద నిరసనలు చేపడతామన్న ఏపీఎన్జీవో

By

Published : Aug 25, 2022, 7:17 PM IST

Updated : Aug 25, 2022, 7:45 PM IST

APNGOs protest సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఏపీఎన్జీవో అధ్యక్షులు బండి శ్రీనివాసరావు అన్నారు. మినిమం స్కేల్ ఇచ్చినా సర్వీసు రెగ్యులరైజ్ చేయలేదని, తెలంగాణ ప్రభుత్వ తరహాలో ఏపీ ప్రభుత్వం కుడా చర్యలు తీసుకోవాలని సూచించారు.

కలెక్టరేట్ల వద్ద నిరసనలు చేపడతామన్న ఏపీఎన్జీవో
కలెక్టరేట్ల వద్ద నిరసనలు చేపడతామన్న ఏపీఎన్జీవో

కలెక్టరేట్ల వద్ద నిరసనలు చేపడతామన్న ఏపీఎన్జీవో

Bandi Srinivasa Rao on CPS: పాలకులు సెప్టెంబరు 1న సీపీఎస్ తీసుకువచ్చారని.. అప్పటినుంచి సెప్టెంబరు 1ని విద్రోహ దినంగా పాటిస్తున్నామని ఏపీఎన్జీవో అధ్యక్షులు బండి శ్రీనివాసరావు అన్నారు. సెప్టెంబరు 1న 26 జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాల వద్ద నల్ల రిబ్బన్​లు ధరించి నిరసనలు తెలుపుతామన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను ఏపీ ప్రభుత్వం క్రమబద్ధీకరణ చేయటం లేదని ఆయన మండిపడ్డారు. మినిమం స్కేల్ ఇచ్చినా.. సర్వీసు రెగ్యులరైజ్ చేయలేదని, తెలంగాణ ప్రభుత్వ తరహాలో ఏపీ ప్రభుత్వం కుడా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని బండి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగులకు పీఆర్సీ, డీఏ బకాయిలు ఇవ్వాలన్నారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో సీపీఎస్​ రద్దు చేస్తామని జగన్ హామీ ఇచ్చినట్లు ఏపీజేఏసీ ప్రధాన కార్యదర్శి హృదయరాజు గుర్తు చేశారు. జీపీఎస్ విధానం వల్ల ఉద్యోగులకు ఉపయోగం లేదన్నారు. రాజస్థాన్, చత్తీస్‌ఘర్​లలో అక్కడి ప్రభుత్వాలు సీపీఎస్​ను రద్దు చేశాయని, అక్కడి రిపోర్ట్ ఆధారంగా ఏపీ ప్రభుత్వం కూడా స్పందించాలన్నారు. ఉద్యోగులపై పెట్టిన కేసులు పూర్తిగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

ఇవీ చూడండి

Last Updated :Aug 25, 2022, 7:45 PM IST

ABOUT THE AUTHOR

...view details