ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వైఎస్సార్ విస్తృత ప్రజాదరణ పొందిన నాయకుడు: గవర్నర్

By

Published : Jul 8, 2021, 10:08 PM IST

తెలుగు ప్రజల హృదయాల్లో వైఎస్సార్ చిరస్థాయిగా నిలిచిపోయారని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ఆయన విస్తృత ప్రజాదరణ పొందిన నాయకుడని.. సమైక్య రాష్ట్ర రాజకీయ రంగంలో తనకంటూ సముచిత స్థానాన్ని ఏర్పరుచుకున్నారని అన్నారు.

governor bishwabhushan harichandan
governor bishwabhushan harichandan

వైఎస్ రాజశేఖర్​ రెడ్డి విస్తృత ప్రజాదరణ పొందిన నాయకుడని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కొనియాడారు. సమైక్య రాష్ట్ర రాజకీయ రంగంలో తనకంటూ సముచిత స్థానాన్ని ఏర్పరచుకున్న నాయకుడన్నారు. రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్సార్, జక్కంపూడి రామ్మోహన్​రావు రక్తనిధి కేంద్రాన్ని రాజ్​భవన్ నుంచి గవర్నర్ ఆన్‌లైన్​లో ప్రారంభించారు. ముఖ్యమంత్రిగా రాజశేఖరరెడ్డి చిన్న, పేద రైతులకు ప్రయోజనం చేకూర్చే విధంగా వ్యవసాయ, నీటిపారుదల రంగాలకు రాష్ట్ర బడ్జెట్‌లో ఎక్కువ నిధులను కేటాయించారని గవర్నర్ గుర్తు చేశారు.

తెలుగు ప్రజల హృదయాల్లో వైఎస్సార్ చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. వైఎస్ పుట్టినరోజును 'రైతు దినోత్సవం'గా జరుపుకోవటం శుభ పరిణాం అని చెప్పారు. జక్కంపూడి రామ్మోహన్ రావు రక్త నిధి ఫౌండేషన్..తన మానవతా కార్యకలాపాలను మరింతగా ముందుకు తీసుకువెళ్లాలని ఆశాభావం వ్యక్తం చేశారు. రక్తదానం ప్రాణ దానంతో సమానమని, మానవ రక్తానికి ప్రత్యామ్నాయం లేదని అన్నారు. ప్రతి నగరంలో నమ్మదగిన రక్త నిధి అవసరం ఉందని ఆరోగ్యకరమైన వ్యక్తులు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని గవర్నర్ పిలుపునిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details