ఆంధ్రప్రదేశ్

andhra pradesh

CMO: సీఎంవోలోని అధికారులకు శాఖల కేటాయింపు.. ఉత్తర్వులు జారీ

By

Published : Mar 2, 2022, 5:59 PM IST

ముఖ్యమంత్రి కార్యాలయంలో పని చేస్తున్న అధికారులకు శాఖలను కేటాయించారు. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

సీఎంవోలోని అధికారులకు శాఖల కేటాయింపు
సీఎంవోలోని అధికారులకు శాఖల కేటాయింపు

ముఖ్యమంత్రి కార్యాలయంలో పని చేస్తున్న అధికారులకు శాఖలను కేటాయిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కొత్తగా సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జవహర్ రెడ్డిని నియామించటంతో సీఎంవోలో పనిచేసే కార్యదర్శులు పర్యవేక్షణ చేసే శాఖల్లో మార్పు చేశారు. జవహర్ రెడ్డికి జీఏడీ, హోం, రెవెన్యూ, అటవీ పర్యావరణ, వైద్యారోగ్య, శాసనసభ వ్యవహారాలు, పరిశ్రమ, పెట్టుబడులు, మౌలిక వసతులు, కేంద్ర ప్రభుత్వ అంశాలు, సీఎంవో ఎస్టాబ్లిష్‌మెంట్ అండ్ రెసిడ్యూవల్ సబ్జెక్టుల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు.

సీఎం కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్‌కు పౌరసరఫరాలు, విద్యా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనులు, ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్, అన్ని సంక్షేమ శాఖలు కేటాయించారు. సీఎం మరో కార్యదర్శి ధనుంజయ్ రెడ్డికి ఆర్థిక, ప్రణాళిక, ఇరిగేషన్, వ్యవసాయ, అనుబంధ రంగాలు, మున్సిపల్ పరిపాలన, ఇంథన, పర్యాటక, యువజన సర్వీసులు, మార్కెటింగ్, సహకార శాఖలను అప్పగించారు. సీఎం అదనపు కార్యదర్శి ముత్యాలరాజుకు ప్రజా ప్రతినిధుల వినతులు, రెవెన్యూ(ల్యాండ్, రిజిస్ట్రేషన్‌ అండ్ స్టాంప్స్), హౌసింగ్, రవాణా, రోడ్లు, భవనాలు, కార్మిక, స్కిల్ డెవలప్​మెంట్ శాఖలను కేటాయించారు.

ABOUT THE AUTHOR

...view details