ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Polavaram: 'పోలవరం నిర్వాసితులకు 15 రోజుల్లో పరిహారమివ్వాలి'

By

Published : Jul 5, 2021, 6:15 PM IST

పోలవరం (polavaram) నిర్వాసితులకు త్వరితగతిన పరిహారం, పునారావాసం కల్పించాలని కోరుతూ..విజయవాడ ధర్నా చౌక్​లో అఖిలపక్షాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ముంపు గ్రామాల ప్రజలకు నష్ట పరిహారం చెల్లించకుండా, ప్రత్యామ్నాయం చూపకుండా పోలీసులతో (police) బలవంతంగా తరలించటంపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

all party leaders protest over polavaram victims compensation
'పోలవరం నిర్వాసితులకు 15 రోజుల్లో పరిహారమివ్వాలి'

పోలవరం (polavaram) ముంపు బాధితులకు ప్రత్యామ్నాయం చూపకుండా, పరిహారం (Compensation) ఇవ్వకుండా బలవంతంగా ఖాళీ చేయించటంపై అఖిలపక్ష నేతలు మండిపడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విజయవాడ ధర్నాచౌక్ వద్ద ఆందోళన చేపట్టారు. నిర్వాసితులకు పరిహారం, పునరావాసం కల్పించకుండా పోలీసులచే బలవంతంగా ఖాళీ చేయించటం సరికాదని వామపక్ష పార్టీల నేతలు రామకృష్ణ,(ramakrishna) మధు(madhu)లు విమర్శించారు. పోలవరం నిర్వాసితుల సమస్య పరిష్కరించకుంటే జైలుకు వెళ్లటానికి కూడా సిద్ధమన్నారు.

నిర్వాసితుల త్యాగఫలంతోనే నేడు పోలవరం ప్రాజెక్టు సాకారమవుతోందని తెదేపా మాజీ మంత్రి దేవినేని ఉమా (devineni uma) అన్నారు. నిర్వాసితులకు వైకాపా ప్రభుత్వం (ap govt) తీరని అన్యాయం చేస్తోందన్నారు. సకాలంలో ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని చెప్పిన మంత్రి అనిల్..నిర్వాసితులు నిలదీస్తారని ప్రాజెక్టు వద్దకు రావటమే మానేశారని ఎద్దేవా చేశారు. బాధిత ప్రజల కోసం పోరాడటానికి తెదేపా సిద్ధంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. పోలవరం బాధితులకు న్యాయం జరిగే వరకు అన్ని పార్టీలతో కలిసి ఉద్యమిస్తామని ఏపీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు మస్తాన్ వలీ (mastan vali) అన్నారు.

నిర్వాసితులకు పరిహారంతో పాటు వరద సాయం కూడా అందించాలన్నారు. 15 రోజుల్లో నిర్వాసితుల సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని అఖిలపక్ష నేతలు హెచ్చరించారు.

ఇదీచదవండి

Water disputes: అంతర్రాష్ట్ర జల వివాదాల్లో కోర్టులు జోక్యం చేసుకోవచ్చా?: తెలంగాణ హైకోర్టు

TAGGED:

ABOUT THE AUTHOR

...view details