ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గన్నవరం విమానాశ్రయంలో నిలిచిన ఎయిరిండియా విమానం

By

Published : Sep 11, 2021, 5:51 PM IST

గన్నవరం విమానాశ్రయంలో సాంకేతికలోపంతో ఎయిరిండియా విమానం నిలిచిపోయింది. సమాచారం అందుకున్న సిబ్బంది సాంకేతిక లోపాన్ని సరిచేస్తున్నారు.

గన్నవరం విమానాశ్రయంలో నిలిచిన ఎయిరిండియా విమానం
గన్నవరం విమానాశ్రయంలో నిలిచిన ఎయిరిండియా విమానం

గన్నవరం విమానాశ్రయం నుంచి దిల్లీ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఫలితంగా ఎయిర్​పోర్ట్​లోనే నిలిచిపోయింది. 177 మంది ప్రయాణికులతో దిల్లీ బయల్దేరాల్సిన విమానం ఆగిపోయింది. దీంతో విమానాశ్రయ సిబ్బంది ప్రయాణికులను తిరిగి లాంజ్​లోకి తరలించారు. సమాచారం అందుకున్న సిబ్బంది విమానంలో తలెత్తిన సాంకేతికలోపాన్ని సరిచేస్తున్నారు. ప్రయాణికులను రాత్రి 8 గంటలకు దిల్లీ పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details