ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Actor Prabhas: సీఎం జగన్, మంత్రి పేర్ని నానికి.. హీరో ప్రభాస్ కృతజ్ఞతలు.. ఎందుకంటే..!

By

Published : Mar 8, 2022, 12:34 PM IST

Actor Prabhas thanks to CM Jagan and Minister Perni Nani: సీఎం జగన్, మంత్రి పేర్ని నానికి.. నటుడు ప్రభాస్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం.. సినీ పరిశ్రమ వర్గాల ఇబ్బందులను ప్రభుత్వం అర్థం చేసుకుందని అన్నారు. పరిశ్రమకు మద్దతుగా నిలిచినందుకు ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు.

Actor Prabhas thanks to cm jagan and minister perni nani
సీఎం జగన్, మంత్రి పేర్ని నానికి.. హీరో ప్రభాస్ కృతజ్ఞతలు

Actor Prabhas thanks to CM Jagan and Minister Perni Nani: రాష్ట్రంలో సినిమా టికెట్ ధరలను సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. ముఖ్యమంత్రి జగన్, మంత్రి పేర్ని నానిలకు అగ్ర కథానాయకుడు ప్రభాస్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు.

ఏపీ ప్రభుత్వం తెలుగు సినీ పరిశ్రమ ఇబ్బందులను, పరిశ్రమ వర్గాల కష్టాలను అర్థం చేసుకొని మద్దతుగా నిలిచిందని పేర్కొన్నారు. మరోవైపు తెలుగు ఫిల్మ్ చాంబర్ కూడా టికెట్ ధరలపై స్పందిస్తూ ప్రత్యేకంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇదే విషయంపై బుధవారం మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రత్యేకంగా మీడియాతో మాట్లాడనున్నట్లు తెలిపారు.

సీఎం జగన్, మంత్రి పేర్ని నానికి.. హీరో ప్రభాస్ కృతజ్ఞతలు

Cinema tickets prices hike: రాష్ట్రంలోని సింగిల్‌ థియేటర్లు, మల్టీప్లెక్స్‌లలో సినిమా టికెట్ల ధరలను నిర్ణయిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. టికెట్‌ ధర కనీసం రూ.20 నుంచి గరిష్ఠంగా రూ.250గా నిర్ణయించింది. ఏసీ, నాన్‌ ఏసీ, థియేటర్లు ఉన్న ప్రాంతాలు, వాటిలో కల్పించే సదుపాయాల ఆధారంగా టికెట్ల ధరలను నిర్ణయించినట్లు ప్రభుత్వం పేర్కొంది.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details