ఆంధ్రప్రదేశ్

andhra pradesh

TIRUMALA: వేసవి రద్దీ దృష్ట్యా.. శ్రీవారి వారపు సేవలు తాత్కాలికంగా రద్దు

By

Published : May 8, 2022, 7:54 AM IST

TIRUMALA
శ్రీవారి ఆలయంలో వారపు సేవలు తాత్కాలికంగా రద్దు

TIRUMALA: తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే వారపు సేవలను తాత్కాలికంగా రద్దు చేసేందుకు తితిదే చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. వేసవి రద్దీ దృష్ట్యా వారపు సేవలను తితిదే రద్దు చేస్తున్నట్లు తెలుస్తోంది.

TIRUMALA: తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే వారపు సేవలను తాత్కాలికంగా రద్దు చేసేందుకు తితిదే చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. మంగళవారం నిర్వహించే అష్టదళ పాదపద్మారాధన సేవ, గురువారం నిర్వహించే తిరుప్పావడ, శుక్రవారం నిర్వహించే నిజపాద దర్శన సేవలను వచ్చే వారం నుంచి తాత్కాలికంగా తితిదే రద్దు చేస్తున్నట్లు తెలిసింది. అష్టదళ పాదపద్మారాధన, నిజపాద దర్శనం టికెట్లు పొందిన భక్తులకు ప్రత్యామ్నాయంగా బ్రేక్‌ దర్శనాన్ని కల్పించాలని తితిదే నిర్ణయించింది.

వేసవి రద్దీ దృష్ట్యా వారపు సేవలను తితిదే రద్దు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వారపు సేవలైన విశేష పూజ, సహస్ర కలశాభిషేకంతో పాటు నిత్య సేవైన వసంతోత్సవ సేవను శాశ్వత ప్రాతిపదికన తితిదే రద్దుచేసి సంవత్సరానికి ఒక పర్యాయం నిర్వహించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇకపై శుక్రవారం అభిషేక సేవ మినహా మిగిలిన వారపు సేవలన్నీ రద్దు కానున్నాయి.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details