ఆంధ్రప్రదేశ్

andhra pradesh

CHANDRABABU TOUR : నేడు కుప్పంలో తెదేపా అధినేత చంద్రబాబు పర్యటన

By

Published : Oct 29, 2021, 2:38 AM IST

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నేటి నుంచి రెండురోజుల పాటు చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించనున్నారు. కుప్పం పట్టణంతో పాటు నియోజకవర్గ పరిధిలోని పలువురు తెదేపా నాయకుల ఇళ్లకు చంద్రబాబు వెళ్లనున్నారు.

తెదేపా అధినేత చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నేటి నుంచి రెండురోజుల పాటు సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం కుప్పం రానున్న చంద్రబాబు... ఇవాళ, రేపు వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సాయంత్రం బస్టాండ్‌ సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ఆయన హాజరుకానున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత తొలిసారిగా చంద్రబాబు నియోజకవర్గానికి రానుండటంతో తెదేపా శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేశాయి. కుప్పం పట్టణంతో పాటు నియోజకవర్గ పరిధిలోని పలువురు తెదేపా నాయకుల ఇళ్లకు చంద్రబాబు వెళ్లనున్నారు. రెండో రోజు పర్యటనలో భాగంగా కుప్పం వ్యాపార సంఘాల నేతలు, సభ్యులతో సమావేశం కానున్నారు.

ABOUT THE AUTHOR

...view details