ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Salakatla Brahmotsavalu: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు భద్రతా ఏర్పాట్లు

By

Published : Sep 1, 2022, 11:55 AM IST

Salakatla Brahmotsavalu: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల భద్రతా ఏర్పాట్లపై పోలీసులు దృష్టి సారించారు. రెండు సంవత్సరాల తర్వాత శ్రీవారి బ్రహ్మోత్సవాలను మాడ వీధుల్లో నిర్వహిస్తున్నందున...భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉందని రాయలసీమ రేంజ్ డీఐజీ రవిప్రకాష్ తెలిపారు. వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

Salakatla Brahmotsavalu
సాలకట్ల బ్రహ్మోత్సవాలు

Salakatla Brahmotsavalu: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భద్రత ఏర్పాట్లు చేస్తున్నామని రాయలసీమ రేంజ్ డీఐజీ రవిప్రకాష్ తెలిపారు. దసరా పండుగ దృష్ట్యా తిరుమలకు భక్తుల తాకిడి ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఉదయం ఆయన శ్రీవారి ఆలయ మాడ వీధుల్లో తితిదే విజిలెన్స్, జిల్లా పోలీసు యంత్రాంగంతో కలిసి పలు ప్రాంతాలను పరిశీలించారు. రెండు సంవత్సరాల తర్వాత బ్రహ్మోత్సవాలను మాడ వీధుల్లో నిర్వహిస్తున్నారన్నారు. తిరుమలకు వచ్చే భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉందన్నారు. గరుడ వాహన సేవ రోజునా ఐదు నుంచి ఆరు లక్షల మంది భక్తులు వచ్చే ఆవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నట్లు చెప్పారు. పోలీసులు చేసిన సూచనలను భక్తులు పాటిస్తే ప్రశాంతంగా వాహన సేవలను తిలకించవచ్చని ఆయన తెలియజేశారు.

ABOUT THE AUTHOR

...view details