ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా ఐఆర్​సీటీసీ యాత్ర'

By

Published : Jan 22, 2021, 4:52 PM IST

సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఐఆర్​టీసీ భారత్​ దర్శన్ యాత్రను చేపట్టినట్లు జనరల్ మేనేజర్ రవికుమార్ చెప్పారు. ఫిబ్రవరి 20న రేణిగుంట నుంచి సర్వీసు ప్రారంభమవుతుందన్నారు.

irctc gm
'సామన్యులకు అందుబాటులో ఉండే విధంగా ఐఆర్​సీటీసీ యాత్ర'

సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఐఆర్​టీసీ భారత్ దర్శన్ యాత్ర ఏర్పాటు చేసినట్లు ఐఆర్​టీసీ జనరల్ మేనేజర్ రవికుమార్, డీజీఎం కిషోర్ కుమార్ తెలిపారు. తిరుపతి రైల్వే స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. అయోధ్య నుంచి చిత్రకూట్ యాత్రకు ప్రత్యేక రైలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఫిబ్రవరి 20న రేణిగుంట నుంచి బయలుదేరనున్న ప్రత్యేక రైలు చిత్రకూట్, వారణాసి, గయా, అయోధ్య, నందిగ్రామ్, ప్రయాగ్, ష్రింగ్వర్పూర్ గుండా ప్రయాణించనున్నట్లు తెలిపారు. ఆసక్తిగలవారు 8287932317, 8287932313 నెంబర్ ను సంప్రదించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details