ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వసతి గృహంలో ఇంటర్ విద్యార్థిని అనుమానస్పద మృతి

By

Published : Apr 21, 2021, 1:49 AM IST

ఇంటర్ విద్యార్థిని వసతి గృహంలో అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. గొంతుపై ఎటువంటి గాయాలు లేవని విద్యార్థిని కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

girls hanged
తిరుపతి వసతి గృహంతో ఇంటర్ విద్యార్థిని అనుమానస్పిద మృతి

తిరుపతిలో ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. నగర శివారులోని తుమ్మలగుంటలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న 17ఏళ్ల విద్యార్థిని... వసతి గృహంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడిందని కళశాల నిర్వహకులు తెలిపారు.

గొంతుపై ఉరి వేసుకున్నట్లు ఎటువంటి గుర్తులు లేవని.. మొహంపై గాయాలు ఉన్నాయని విద్యార్థి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఉరి వేసుకుందని ఓసారి .. ఫిట్స్ వచ్చిందని మరోసారి కళాశాల నిర్వాహకులు చెబుతున్నారంటూ ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు ఎంఆర్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. విద్యార్థినికి ఎటువంటి సమస్యలు లేవని.. శ్రీరామనవమికి ఇంటికి వస్తానని ఫోన్​లో చెప్పిందని పోలీస్ స్టేషన్ ఎదుట మృతురాలి బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఎమ్మార్ పల్లి పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం ఎస్వీ వైద్య కళాశాలకు తరలించారు.

ఇదీ చదవండి:గోడ కూలి ఐదో తరగతి విద్యార్థి మృతి

ABOUT THE AUTHOR

...view details