ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నేడు ఆంధ్రప్రదేశ్ కు అమిత్​షా.. రాష్ట్రంలో మూడు రోజుల పర్యటన..

By

Published : Nov 13, 2021, 6:40 AM IST

మూడు రోజుల పర్యటన నిమిత్తం నేడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తిరుపతికి రానున్నారు. సాయంత్రం 7 గంటల 40 నిమిషాలకు ఆయన తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు.

home minister amith shah tirupathi tour
home minister amith shah tirupathi tour

కేంద్ర హోం మంత్రి అమిత్ షా మూడు రోజుల పర్యటన నిమిత్తం నేడు తిరుపతికి రానున్నారు. సాయంత్రం 7.40 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకుని.. అక్కడి నుంచి నేరుగా తాజ్ హోటల్​కు వెళ్తారు. రాత్రి అక్కడే బస చేస్తారు. ఆదివారం ఉదయం భారత వైమానిక దళ హెలికాఫ్టర్లో బయల్దేరి నెల్లూరు జిల్లా వెంకటాచలానికి చేరుకుంటారు. అక్షర విద్యాలయ, స్వర్ణభారతి ట్రస్టు , ముప్పవరపు ఫౌండేషన్లకు సంబంధించిన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. నైపుణ్యాభివృద్ధి కేంద్రం, గ్రామీణ స్వయం సాధికార శిక్షణ సంస్థను సందర్శిస్తారు.

మధ్యాహ్నం స్వర్ణభారతి ట్రస్టు 20 వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 2.40 గంటలకు తిరుపతిలోని తాజ్ హోటల్​కు చేరుకుంటారు. అదే హోటల్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి జరిగే సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొంటారు. ఆ భేటీ ముగిశాక ఆదివారం రాత్రి తాజ్ హోటల్లోనే బస చేస్తారు. సోమవారం ఉదయం వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతి విమానాశ్రయం నుంచి బయల్దేరి సాయంత్రం 5.40 కు దిల్లీ చేరుకుంటారు.

ఇదీ చదవండి:TDP complaint to SEC: 'ప్రచారం నిర్వహిస్తున్న వాలంటీర్లపై చర్యలు తీసుకోవాలి'

ABOUT THE AUTHOR

...view details