ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కనుమ దారిలో కారు బోల్తా.. తప్పిన పెను ప్రమాదం

By

Published : Jun 17, 2021, 10:19 PM IST

తిరుమల కనుమ దారిలో కొండను ఢీకొట్టి ఓ కారు బోల్తా పడింది. ఈ ఘటనలో కారులోని కర్ణాటకకు చెందిన భక్తులు స్వల్ప గాయలతో బయటపడ్డారు. బ్రేకులు ఫెయిల్ కావడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు పేర్కొన్నారు.

road accident in kanuma
కనుమ దారిలో కారు బోల్తా

తిరుమల కనుమ దారిలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారు బోల్తా పడింది. కారులో ఉన్న కర్ణాటకకు చెందిన భక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. శ్రీవారి దర్శనం ముగించుకుని.. తిరుగుపయనంలో కొండపై నుంచి కిందకు దిగే సమయంలో కారు అదుపు తప్పి కొండను ఢీకొట్టి బోల్తా పడింది. బ్రేకులు ఫెయిల్ అవడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. కారు రహదారిపై అడ్డంగా పడడంతో కాసేపు ట్రాఫిక్​ ఏర్పడింది. భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకుని వాహనాన్ని తొలగించారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details