ఆంధ్రప్రదేశ్

andhra pradesh

TOP NEWS : ప్రధానవార్తలు @ 3pm

By

Published : Nov 25, 2021, 2:59 PM IST

.

ప్రధానవార్తలు @ 3pm
ప్రధానవార్తలు @ 3pm

  • Atchannaidu: వైకాపా నేతల వ్యాఖ్యల్ని ఖండిస్తే వేధిస్తారా?: అచ్చెన్నాయుడు
    చంద్రబాబు సతీమణిపై వైకాపా నేతలు చేసిన వ్యాఖ్యల్ని ఖండించిన అనంతపురం తెలుగు బీసీ మహిళా నేతల్ని పోలీసుల వేధించటం దుర్మార్గమని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • TDP PROTEST: అనంతపురంలో తెదేపా నాయకులు, పోలీసుల మధ్య తోపులాట
    తెలుగుదేశం అధినేత చంద్రబాబు సతీమణిపై అధికార పార్టీ నాయకుల వ్యాఖ్యలను ఖండించామనే కక్షతో పోలీసులు తమను తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నారని.. అనంతపురం తెలుగుదేశం నాయకురాళ్లు ఆరోపించారు. రౌడీల ఇళ్లల్లో చేయాల్సిన సోదాలు తమ ఇళ్లలో చేయడం ఏంటని ప్రశ్నించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • Vehicle Tax: కొత్త వాహనాలపై పన్ను భారం
    కొత్త వాహనాలు కొనేవారికి జీవితపన్ను భారాన్ని ప్రభుత్వం మరింత పెంచింది. వాహనం ధరను బట్టి ఈ పన్ను వర్తింపజేసేలా సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది. దీంతో బైకులకు 3%, రూ.10 లక్షలు దాటిన కార్లకు 3-4% జీవితపన్ను అధికంగా చెల్లించాల్సి వస్తుంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • హైవేపై కారులో వెళ్తూ గ్యాంగ్​రేప్.. ఎస్సై కావాల్సిన మహిళపై...
    ఎస్సై ఉద్యోగం కోసం రాత పరీక్షకు హాజరై వస్తున్న ఓ యువతిపై కదులుతున్న కారులో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు దుండగులు. ఫేస్​బుక్​లో పరిచయమైన వ్యక్తే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు ఉపయోగించిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • ఆరు నెలల తర్వాత ముంబయిలో ప్రత్యక్షమైన పరమ్​బీర్ సింగ్​
    ముంబయి మాజీ పోలీస్​ కమిషనర్​ పరమ్​బీర్ సింగ్ చాలా రోజుల తర్వాత నగరంలో ప్రత్యక్షమయ్యారు. బలవంతపు వసూళ్ల కేసులో విచారణ కోసం అధికారుల ఎదుట హాజరయ్యారు(parambir singh news).పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • Family Health Survey: దేశంలో అత్యల్ప స్థాయికి సంతానోత్పత్తి రేటు!
    National Family Health Survey: భారత దేశ జనాభా తగ్గుముఖం పడుతోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తొలిసారి సంతానోత్పత్తి రేటు (India fertility rates) పలు రాష్ట్రాల్లో భారీగా తగ్గడం గమనార్హం. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • ఆ వెబ్​సిరీస్ చూసినందుకు కిమ్ శిక్ష- ఒకరికి మరణదండన.. మరొకరికి...
    నెట్​ఫ్లిక్స్​లో సూపర్​హిట్​గా నిలిచిన ఓ వెబ్​సిరీస్​ను తమ దేశంలోకి స్మగ్లింగ్ చేసిన వ్యక్తికి మరణశిక్ష విధించింది ఉత్తరకొరియా. ఈ సిరీస్​ను యూఎస్​బీలో కాపీ చేసినందుకు ఓ పాఠశాల విద్యార్థికి జీవిత ఖైదు శిక్ష ఖరారు చేసింది. వెబ్​సిరీస్​ చూసిన అతని స్నేహితులను ఐదేళ్ల పాటు జైల్లో ఉంచాలని ఆదేశించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • శాం​సంగ్ ఇండియాలో భారీగా ఉద్యోగ అవకాశాలు!
    ప్రముఖ టెక్​ సంస్థ శాంసంగ్(Samsung India)​.. నిరుద్యోగులకు శుభవార్తను అందించింది. భారత్​లో వచ్చే ఏడాది క్యాంపస్​ నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపింది. 1000 మంది ఇంజనీర్లను నియమించుకోనున్నట్లు స్పష్టం చేసింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • పెవిలియన్​కు రహానె, పుజారా.. టీ విరామానికి 154/4
    న్యూజిలాండ్​తో కాన్పుర్​ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భాగంగా టీమ్​ఇండియా(IND vs NZ 1st test) ఆచితూచి ఆడుతోంది. టీ విరామానికి నాలుగు వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • samantha: మహేశ్-త్రివిక్రమ్​ మూవీ నుంచి పూజా ఔట్​.. సామ్​కు ఛాన్స్​!
    వరుస సినిమాలతో బిజీగా ఉన్న హాట్​ బ్యూటీ పూజా హెగ్డే.. క్రేజీ ప్రాజెక్టును వదులుకున్నట్లు సమాచారం. సూపర్​స్టార్ మహేశ్ బాబు-త్రివిక్రమ్ (Mahesh Babu Trivikram Movie) కాంబోలో రానున్న చిత్రం నుంచి తప్పుకోనున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details