ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Ntr Trust: వరద బాధితులకు ఎన్టీఆర్ ట్రస్టు సాయం

By

Published : Nov 22, 2021, 10:38 PM IST

ntr trust helps flood affected victims with orders of cbn wife bhuwaneshwari

వరద బాధితులకు ఎన్టీఆర్ ట్రస్టు సభ్యులు సేవా కార్యక్రమాలు చేపట్టి తమ ఉదారతను చాటుకుంటున్నారు. నారా భువనేశ్వరి(chandrababu wife) ఆదేశాల మేరకు.. ముంపు ప్రాంతాల్లో ఉన్న వారికి తాగునీరు, పాలు, బ్రెడ్ భోజన ప్యాకెట్లు అందజేశారు. చిత్తూరు జిల్లాలోని పాతపేట గ్రామంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి.. మందులను పంపిణీ చేశారు.

తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి(nara bhuwaneshwari) ఆదేశాల మేరకు.. వరద ముంపు ప్రాంతాల్లో ఎన్టీఆర్ ట్రస్ట్ సభ్యులు.. సేవా కార్యక్రమాలు చేపట్టి తమ ఉదారత చాటుకుంటున్నారు. భారీ వర్షాల్లోనూ ట్రస్ట్ సభ్యులు.. మోకాల్లోతు నీళ్లలో ఇంటింటికీ తిరిగి.. తాగునీరు, పాలు, బ్రెడ్ భోజన ప్యాకెట్లు అందజేశారు. తిరుపతి ఆటోనగర్, గొల్లవానికుంట ప్రాంతాల్లో 1500 మందికి ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు.

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో వరద బాధితులకు ఆహార ప్యాకెట్లు అందజేసి.. పాతపేట గ్రామంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. మందులను ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా పంపిణీ చేశారు.

నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ పరిధిలోని ఇందుకూరుపేట, విడవలూరు, కోవూరు, బుచ్చిరెడ్డిపాళ్యం మండలాల్లో.. వరద బాధిత కుటుంబాలకు సాయం చేశారు. భోజన పంపిణీ(food distribution)తో పాటు ఇతర సహాయ చర్యలు చేపట్టారు. ఆత్మకూరు నియోజకవర్గం బండారుపల్లి గ్రామంలో బాధిత కుటుంబాలకు 1500 ఆహార ప్యాకెట్లు, కోవూరులో 2 వేల ప్యాకెట్లను ఎన్టీఆర్ ట్రస్ట్ సభ్యులు అందజేశారు.

ఇదీ చదవండి:

CBN on Jagan: రాజధానిపై సీఎం జగన్ వైఖరి వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details