ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'10 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేదు'

By

Published : Nov 28, 2020, 1:46 AM IST

పెన్నా నదికి 10 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా, నెల్లూరుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపడతామని జలవనరులశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. నెల్లూరు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించామని తెలిపారు. సహాయచర్యలు ముమ్మరం చేశామన్నారు.

Minister anil kumar yadav
Minister anil kumar yadav

పెన్నా నదికి భారీ వరద వచ్చినా నెల్లూరు నగరానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపడతామని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన.. పునరావాస కేంద్రాల్లో సౌకర్యాలను పరిశీలించారు. పెన్నానదికి 10 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా, నెల్లూరుకు ఇబ్బంది లేకుండా రింగ్ బండ్ ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు.

పెన్నా నదికి దాదాపు నాలుగు లక్షల క్యూసెక్కుల వరద రావడం వల్ల లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని, దాదాపు నాలుగు వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించామని చెప్పారు. వరద తగ్గిన వెంటనే మరమ్మతు పనులు చేపడుతామన్నారు. సహాయ చర్యలు ముమ్మరం చేశామన్నారు.

ఇదీ చదవండి :నేడు తితిదే పాలకమండలి భేటీ...ఆర్థిక పరిస్థితులపై చర్చ

ABOUT THE AUTHOR

...view details