ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Floods Relief Operations: నెల్లూరు జిల్లాలో నాలుగోరోజు వరద సహాయచర్యలు

By

Published : Nov 22, 2021, 12:06 PM IST

నెల్లూరు జిల్లాలో నాలుగోరోజు వరద సహాయచర్యలు(flood relief operations in Nellore) కొనసాగుతున్నాయి. మరోవైపు సోమశిల జలాశయానికి ఎగువ నుంచి వరద(floods for Somasila reservoir) ఉద్ధృతి వస్తోంది.

Floods Relief Operations
నెల్లూరు జిల్లాలో నాలుగోరోజు వరద సహాయచర్యలు

భారీ వర్షాల నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో నాలుగోరోజు వరద సహాయచర్యలు(flood relief operations in Nellore) కొనసాగుతున్నాయి. కోవూరు మండలం ఓగూరు, సత్యవతినగర్‌, పట్టపుపాలెం, శాంతినగర్‌, పెళ్లకూరుకాలనీలో అధికారులు సహాయచర్యలు చేపట్టారు. నెల్లూరులోని వెంకటేశ్వరపురం, భగత్‌సింగ్‌ కాలనీ, జనార్దన్‌రెడ్డి కాలనీ, పొర్లుగట్ట ప్రాంతాల్లో ప్రాంతాల్లో వరద ప్రభావం కొనసాగుతోంది.

సోమశిల జలాశయానికి ఎగువ నుంచి వరద ఉద్ధృతి

నెల్లూరులోని సోమశిల జలాశయానికి ఎగువ నుంచి వరద(floods for Somasila reservoir) వస్తోంది. ప్రాజెక్టు 12 గేట్లు ఎత్తి పెన్నానదికి నీటి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సోమశిల జలాశయం ఇన్‌ఫ్లో 1,71,489 క్యూసెక్కులు.. ఔట్‌ఫ్లో 1,79,345 క్యూసెక్కులుగా ఉంది.

ఇదీ చదవండి..

Amravati Padayatra: ఉధృతంగా సాగిన మహా పాదయాత్ర.. వెల్లువెత్తిన సంఘీభావం

ABOUT THE AUTHOR

...view details