ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రోడ్డు దాటుతుండగా ప్రమాదం.. ఒకరు మృతి

By

Published : Oct 30, 2021, 2:41 AM IST

కర్నూలు నగరంలోని బిర్లా కాంపౌండ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి.

రోడ్డు దాటుతుండగా ప్రమాదం
రోడ్డు దాటుతుండగా ప్రమాదం

కర్నూలులో నగరంలోని బిర్లా కాంపౌండ్ వద్ద రోడ్డు దాటుతున్న ఇద్దరు వ్యక్తులను ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో కింద పడిన ఓ వ్యక్తిని.. వెనుక నుంచి వస్తున్న బోలోరో వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కింద పడిన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు పత్తికొండ నియోజకవర్గంలోని కటారుకొండ గ్రామానికి చెందిన బాలరాజుగా గుర్తించారు. ట్రాఫిక్ డీఎస్పీ మహబూబ్ బాషా ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి.

రోడ్డు దాటుతుండగా ప్రమాదం

ABOUT THE AUTHOR

...view details