ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మత్స్యకార వర్గాల మధ్య ఘర్షణ.. పరస్పర దాడితో ఉద్రిక్తత

By

Published : Aug 28, 2021, 4:54 PM IST

కాకినాడ మత్స్యకార సమావేశంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఒకరినొకరు దూషిస్తూ వాగ్వాదానికి దిగారు. పరిస్థితి అదుపు తప్పిన స్థితిలో పోలీసులు జోక్యం చేసుకుని.. ఉద్రిక్తతలను చల్లబరిచారు.

మత్స్యకార సమావేశంలో ఇరువర్గాల ఘర్షణ
మత్స్యకార సమావేశంలో ఇరువర్గాల ఘర్షణ

తూర్పు గోదావరి జిల్లా కాకినాడ మత్స్యశాఖ జేడీ కార్యాలయంలో ఇరు వర్గాల మత్స్యకారుల మధ్య ఘర్షణ జరిగింది. భైరవపాలెం, కాకినాడ జాలరులకు చేపల వేట అంశంలో విబేధాలు ఉన్నాయి. వీటిని పరిష్కరించేందుకు అధికారులు సమావేశం ఏర్పాటు చేశారు.

కాకినాడ జట్టులో భైరవపాలెం మత్య్సకారుల్ని అనుమతించకూడదని చర్చ జరుగుతున్న సమయంలో.. ఇరు వర్గాల మధ్య మాటా మాటా పెరిగి, వాగ్వాదానికి దిగారు. ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలకు నచ్చజెప్పారు.

ABOUT THE AUTHOR

...view details