ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Diarrhea : కాకినాడలో డయేరియా పంజా.. 15 కేసులు నమోదు

By

Published : May 18, 2022, 8:28 PM IST

కాకినాడలో అతిసారం కలవరపాటుకు గురి చేస్తోంది. కలుషిత నీరు తాగి ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురికావటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా నేడు 15 మంది వాంతులు, విరేచనాలతో ఆసుపత్రి పాలయ్యారు.

వైద్య శిబిరం
వైద్య శిబిరం

కాకినాడలో డయేరియా విజృంభించింది. నేడు 15 మంది వాంతులు, విరేచనాలతో ఆసుపత్రి పాలయ్యారు. అప్రమత్తమైన అధికారులు.. ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. తాగునీరు, పెళ్లి, జాతర, భోజనాలు కలుషితం అవ్వడం వల్ల అతిసారం బారిన పడుతున్నట్లు గుర్తించామని వైద్యులు తెలిపారు.

వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని.. వారిని జీజీహెచ్​కు తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. ప్రస్తుతం రోగుల పరిస్థితి అదుపులోనే ఉందని వైద్యాధికారి చరణ్ తెలిపారు. ప్రజలు అప్రమత్రంగా ఉండాలని సూచించారు.

ఇదీచదవండి:చిన్నపిల్లల్లో అతిసారం.. తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?

ABOUT THE AUTHOR

...view details