ఆంధ్రప్రదేశ్

andhra pradesh

MURDERS: కడపలో ఘోరం.. తల్లీకూతుళ్లను బలిగొన్న క్షణికావేశం!

By

Published : Oct 21, 2021, 3:18 PM IST

Updated : Oct 21, 2021, 4:51 PM IST

కుమార్తెను చంపిన తల్లి.
కుమార్తెను చంపిన తల్లి.

15:15 October 21

తల్లీ కుమార్తె హత్య

కుమార్తెను చంపిన తల్లి.

 అర్థంలేని కోపం.. రెండు నిండు ప్రాణాలను బలిగొంది! ఓ తల్లి తన కుమార్తెను ఉరివేసి చంపగా.. సోదరిని చంపిందన్న కోపంతో.. ఆ తల్లిని కత్తితో పొడిచి చంపేశాడు ఆమె కుమారుడు. కడప జిల్లాలో జరిగిన ఈ దారుణ సంఘటన.. స్థానికంగా భయాందోళన రేకెత్తించగా.. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగించింది.

ఏం జరిగిందంటే..?
కడప జిల్లా కేంద్రంలోని నకాష్ వీధికి చెందిన షేక్ హుస్సేన్, షేక్ కృశిదా భార్యాభర్తలు. వీరికి షేక్ అలీమా, షేక్  జమీర్ అనే పిల్లలు ఉన్నారు. అయితే.. కొంత కాలం క్రితం భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. దీంతో.. భర్త నుంచి విడిపోయిన కృశిదా.. పిల్లలతో కలిసి వేరుగా నివసిస్తోంది. 

అయితే.. బుధవారం రాత్రి తల్లి కృశిదా, కూతురు అలీమా మధ్య వాగ్వాదం జరిగింది. అలీమా నిత్యం ఫోన్లో మునిగిపోయి ఉంటోందని తల్లి కృశిదా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయమై ఇద్దరిమధ్యా గొడవ మొదలైంది. దీంతో.. కోపోద్రిక్తురాలైన కృశిదా.. కూతురు అలిమాను చున్నీతో ఉరివేసి చంపింది. ఈ దారుణం చూసిన కుమారుడు జమీర్.. సోదరిని చంపేసిందన్న కోపంతో.. క్షణికావేశంతో తల్లిని కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. 

ఈ విధంగా స్వల్వ వ్యవధిలోనే.. ఒకే ఇంట్లో రెండు నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.

ఇవీచదవండి. 

Last Updated : Oct 21, 2021, 4:51 PM IST

ABOUT THE AUTHOR

...view details