ఆంధ్రప్రదేశ్

andhra pradesh

CLAP PROGRAM: 'క్లీన్ ఆంధ్రప్రదేశ్-క్లాప్‌'.. పూర్తిగా ఫ్లాప్

By

Published : May 3, 2022, 4:29 PM IST

CLAP PROGRAM: వైఎస్సార్ జిల్లాలో ప్రవేశపెట్టిన 'క్లీన్ ఆంధ్రప్రదేశ్-క్లాప్‌' కార్యక్రమం అస్తవ్యస్థంగా తయారైంది. ఆశించిన దాని కంటే తక్కువ మొత్తంలో పన్ను వసూలవుతుండటంతో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. నగరపాలకసంస్థ పరిధిలోని 67 సచివాలయాల్లోనే ఇది అమలవుతోంది. వైఎస్సార్ జిల్లాలో 50 డివిజన్లుంటే..... రెండు, మూడు డివిజన్లకు కలిపి ఒక్కో ఆటో కేటాయించడం వల్లే ఈ పరిస్థితికి కారణమంటున్నారు.

CLEAN ANDHRA PRADESH CLAP PROGRAM
వైఎస్సార్ జిల్లాలో అస్తవ్యస్థంగా తయారైన 'క్లీన్ ఆంధ్రప్రదేశ్-క్లాప్‌'

CLAP PROGRAM: వైఎస్సార్ జిల్లాలో 'క్లీన్ ఆంధ్రప్రదేశ్-క్లాప్‌' కార్యక్రమం అస్తవ్యస్థంగా తయారైంది. నగరపాలకసంస్థ పరిధిలోని 67 సచివాలయాల్లోనే అమలవుతోంది. నెలకు 35 లక్షల రూపాయలు చెత్త పన్ను వసూలు కావాల్సి ఉండగా 8 లక్షలు మాత్రమే వసూలవుతుండం.. అధికారుల అంచనాలను తలకిందులు చేసింది.

వైఎస్సార్ జిల్లాలో అస్తవ్యస్థంగా తయారైన 'క్లీన్ ఆంధ్రప్రదేశ్-క్లాప్‌'

క్లీన్ ఆంధ్రప్రదేశ్‌ అంటూ మార్చి 1న వైఎస్సార్ నగరపాలక సంస్థ పరిధిలో క్లాప్‌ పథకం ప్రారంభించారు. వైఎస్సార్ నగరపాలక సంస్థ పరిధిలో 100 సచివాలయాలు పని చేస్తున్నాయి. వీటి పరిధిలో దాదాపు.. 95 వేల నివాస గృహాలున్నాయి. వాటి నుంచి చెత్త సేకరణకు రిక్షాల స్థానంలో.. ఆటోలను ప్రవేశపెట్టారు. తడి, పొడి చెత్త వేరుగా సేకరిస్తామని అధికారులు ప్రకటించారు. ఆటోల రాకతో వైఎస్సార్ నగరపాలికలో ఎప్పట్నుంచో పనిచేస్తున్న.. 120 మంది పారిశుద్ధ్య కార్మికుల్ని అధికారులు తొలగించారు. మిగిలిన కార్మికుల్లో 200 మందిని ఆటోలకు వినియోగించుకుంటున్నారు. రిక్షా కార్మికులు రోజుమార్చిరోజు ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించేవారు. ఆటోలువచ్చాక వారం రోజులకు ఒకసారి రావడమే గగనమైందనే విమర్శలున్నాయి.వైఎస్సార్ జిల్లాలో 50 డివిజన్లుంటే రెండు, మూడు డివిజన్లకు కలిపి ఒక్కో ఆటో కేటాయించడం వల్లే ఈ పరిస్థితికి కారణమంటున్నారు.

క్లాప్ కార్యక్రమానికి క్షేత్రస్థాయిలో ఆశించిన స్పందన కనిపించక.. కేవలం 67 సచివాలయాలపరిధిలోనే చెత్త సేకరిస్తున్నారు. మురికివాడల్లో ఒక్కో ఇంటికి 40 రూపాయలు, మిగిలిన ప్రాంతాల్లో 90 రూపాయల చొప్పున చెత్త సేకరణకు.. వసూలు చేయాల్సి ఉంది. సగటున ఒక్కో ఇంటినుంచి 56 రూపాయల లెక్కన.. నెలకు 35 లక్షల 28 వేల రూపాయలు వసూలు చేయాల్సి ఉంది. కానీ వసూళ్లు 25 శాతం దాటడంలేదు. వైఎస్సార్ నగరపాలక పరిధిలోని.. వ్యాపార, వాణిజ్య ప్రాంతాల నుంచి చెత్త పన్ను సేకరణ ఇంకా ప్రారంభం కాలేదు. కమర్షియల్ ప్రాంతాల్లో చెత్త పన్ను వసూళ్లకు నగరాన్ని 11 జోన్లుగా విభజించారు. చెత్త సేకరణకు.. ఏజెన్సీని నియమించాల్సి ఉండగా.. ప్రస్తుతం పారిశుద్ధ్య కార్మికులతోనే పనికానిస్తున్నారు. వాళ్లూ చెత్త సేకరణ సామాగ్రి ఇవ్వడంలేదని వాపోతున్నారు. వైఎస్సార్ జిల్లాలో ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను.. పాతమున్సిపల్ కార్యాలయ ఆవరణలోనే డంప్‌ చేస్తున్నారు. నగరం మధ్యలో యార్డు ఏంటని ప్రజలుఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

ఇదీ చదవండి: భారీ గాలులు, వర్షం వల్లే ట్రిప్‌.. గ్రిడ్ వైఫల్యంపై సింహాద్రి ఎన్టీపీసీ

ABOUT THE AUTHOR

...view details