ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మూడేళ్లుగా ఎన్నికల గురించి ఎందుకు మాట్లాడలేదు..? అంబటి

By

Published : Jan 23, 2021, 4:22 PM IST

ambati fiers on sec nimmagadda
నిమ్మగడ్డపై ఎమ్మెల్యే అంబటి ఆగ్రహం

మూడేళ్లుగా పదవిలో ఉన్న ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎన్నికలపై అప్పుడెందుకు తొందరపడలేదని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా మరో మూడు నెలల పాటు ఆగలేరా అని నిలదీశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ అసాధ్యమని స్పష్టం చేశారు.

వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు

పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్​ను విడుదల చేయడంపై వైకాపా తీవ్ర స్థాయిలో స్పందించింది. ప్రస్తుత పరిస్ధితుల్లో ఎన్నికలు వద్దని ప్రభుత్వం పదే పదే కోరుతున్నా వాటిని పక్కన పెట్టారని ఆ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 2018లోనే పంచాయతీ ఎన్నికలు జరగాల్సి ఉన్నా... అప్పట్నుంచి పదవిలో ఉన్నా.. నిమ్మగడ్డ ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. కరోనాతో ఉద్యోగులు మరణిస్తే ఎవరూ బాధ్యులని నిలదీశారు.

వ్యాక్సినేషన్, ఎన్నికల ప్రక్రియ రెండూ ఒకేసారి నిర్వహించటం కష్టంతో కూడిన పని కాబట్టే ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతున్నామన్నారు. ఎన్నికలు వద్దని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశామని... తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తే అప్పుడు తమ అభిప్రాయం చెబుతామన్నారు.

ఇదీ చదవండి

చర్చించేందుకు వీడియో కాన్ఫరెన్స్​ సరైన వేదిక..సీఎస్​కు లేఖలో ఎస్​ఈసీ

ABOUT THE AUTHOR

...view details