ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గుంటూరు కార్పొరేషన్ నూతన పాలకవర్గం సమావేశం

By

Published : Mar 27, 2021, 3:13 PM IST

గుంటూరు నగర పాలక సంస్థ నూతన పాలకవర్గం మొదటిసారి సమావేశమైంది. ఈ సందర్భంగా కార్పొరేషన్​ పరిధిలోని వివిధ సమస్యల పరిష్కారానికి చేపట్టాల్సిన అంశాలపై చర్చించింది.

gmc new governing body
జీఎంసీ నూతన పాలకవర్గం సమావేశం

గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ నూతన పాలకవర్గం మొదటి సమావేశం జరిగింది. కార్పొరేషన్​ పరిధిలోని మార్కెట్లు, బహిరంగ ప్రదేశాల్లో టెండర్లు, అశీలు వసూలుతో పాటు తాగునీటి సమస్య పరిష్కారం కోసం చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. పాఠశాలల్లో విద్యార్థులకు తగిన ఉపాధ్యాయులు లేరని.. తక్షణమే దానిపై దృష్టి సారించాలని మేయర్​కు ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు సూచించారు. దీనిపై స్పందించిన మేయర్.. తదుపరి సమావేశంలో ఈ అంశాన్ని ఎజెండాగా చేర్చి ఆమోదిస్తామని హామీ ఇచ్చారు.

రోడ్ల పక్కన బండ్లు పెట్టుకుని వ్యాపారాలు చేసుకునే వారి నుంచి డబ్బులు వసూలు చేయడం సమంజసం కాదని.. దీనిపై పునర్​ పరిశీలన చేయాలని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా సూచించారు. టెండర్లలో పాల్గొనేవారు కొందరు చెల్లని చెక్కులు ఇస్తున్నారని.. అలాంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ అన్నారు.

టెండర్లు పారదర్శకంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని కౌన్సిల్ విపక్ష నేత కోవెలమూడి రవీంద్ర అన్నారు. నగరంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న హోర్డింగులపై తెదేపా కార్పొరేటర్ బుజ్జి అభ్యంతరం వ్యక్తం చేశారు. రోడ్డు మధ్యలో హోర్డింగులు ఏర్పాటు చేయడంపై ప్రశ్నించారు.

ఇదీచూడండి:

భర్తతో గొడవ... అత్త మామలను గెంటేసి ఇంటికి తాళాలు వేసిన కోడలు

ABOUT THE AUTHOR

...view details