ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పునరావాస కేంద్రాలు ఖాళీ చేయండి:బాధితులకు అధికారుల హుకుం

By

Published : Aug 2, 2022, 7:40 AM IST

rehabilitation centers

Flood victims: ‘వెంటనే పునరావాస కేంద్రాలను ఖాళీ చేసి గ్రామాలకు వెళ్లిపోండి.. లేకుంటే మేమే మిమ్మల్ని ఖాళీ చేయిస్తాం’ అని అంటూ ఏలూరు జిల్లా వేలేరుపాడు వరద బాధితులకు అధికారులు ఆదివారం హుకుం జారీ చేశారు.

Flood victims: ఇటీవల గోదావరి వరదలకు గురైన తాట్కూరుగొమ్ము, వేలేరుపాడు ఎస్సీకాలనీ, వేలేరుపాడు సంతబజారు, జగన్నాథపురం గ్రామాలకు చెందిన సుమారు 800 కుటుంబాలకు శివకాశీపురం, భూదేవిపేట ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాల, కస్తూర్బాగాంధీ విద్యాలయంలో అధికారులు పునరావాసం కల్పించారు. ప్రస్తుతం వరద తగ్గుముఖం పట్టినప్పటికీ ఆయా గ్రామాల్లోని వందలాది పూరిగుడిసెలు నేలమట్టం కావడంతో బాధితులు తమ ఇళ్లకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఇదేమీ పట్టని రెవెన్యూ అధికారులు అర్ధరాత్రి హడావుడిగా పునరావాస కేంద్రాలకు చేరుకొని సోమవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభించాల్సి ఉన్నందున బాధితులంతా తక్షణమే అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. దీంతో అనేక మంది తట్టాబుట్టా సర్దుకుని సమీప గ్రామాలకు చేరుకోగా, పలు గ్రామాల్లో ఇళ్లు కూలిపోయిన 35 బాధిత కుటుంబాల వారు మాత్రమే పునరావాస కేంద్రాల్లో ఉన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details