ఆంధ్రప్రదేశ్

andhra pradesh

TELENGANA: మనసున్న మా రాజు.. ఈ యువరాజ్

By

Published : Jul 28, 2021, 8:50 PM IST

ప్రముఖ మాజీ క్రికెటర్​ యువరాజ్​ సింగ్​(Yuvaraj Singh) తన ఔధార్యాన్ని మరోసారి చాటుకున్నారు. కొవిడ్​పై పోరులో పేదలకు సాయంగా నిలుస్తూ నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో 120 ఐసీయూ పడకలు ఏర్పాటు చేశారు. ఈ బెడ్లను యువరాజ్ సింగ్ వర్చువల్​గా ప్రారంభించారు.

Former cricketer Yuvraj Singh
మాజీ క్రికెటర్​ యువరాజ్​ సింగ్

మాజీ క్రికెటర్​ యువరాజ్​ సింగ్

టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్(Yuvaraj Singh)​ ఉదారతను చాటారు. కరోనాపై పోరులో పేదలకు సాయంగా నిలిచారు. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో 120 ఐసీయూ పడకలు ఏర్పాటు చేసి తన గొప్ప మనసును చాటాడు యువీ. రూ.2.5కోట్లతో యూవీకెన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ పడకలు అందుబాటులో తీసుకురాగా ఈరోజు యువరాజ్ సింగ్ వర్చువల్​గా బెడ్లను ప్రారంభించారు.

మిషన్ 1000 బెడ్స్ నినాదంతో

కలెక్టర్ నారాయణరెడ్డి యూవీకెన్ వార్డులను ప్రారంభించారు. హోంమంత్రి మహమూద్ అలీ వర్చువల్​గా పాల్గొని యువరాజ్ సింగ్​ సేవలను కొనియాడారు. దేశంలో వైద్య కళాశాలలు, ఆర్మీ ఆస్పత్రిల్లో వెయ్యి పడకలు ఏర్పాటు లక్ష్యంగా మిషన్ 1000 బెడ్స్ నినాదంతో యూవీకెన్ ఫౌండేషన్ పని చేస్తోందని తెలిపారు. కొవిడ్ పోరులో యువీ సాయం చేయడం అభినందనీయమని హోం మంత్రి మహమూద్ అలీ కొనియాడారు. తెలంగాణలో మొదటగా అది నిజామాబాద్ ఆస్పత్రిలో యువరాజ్ సింగ్ ఏర్పాటు చేసిన పడకలు పేదలకు ఎంతగానో మేలు చేస్తాయని కలెక్టర్ నారాయణ రెడ్డి ప్రశంసించారు.

క్యాన్సర్​ను జయించాడు

భారత్​కు 2007లో టీట్వంటీ వరల్డ్​ కప్​ రావడంలో యువీ ప్రముఖ పాత్ర వహించారు. 2011లో వరల్డ్​ కప్ రావటంలో కూడా యువీ కృషి ఎంతో ఉంది. క్యాన్సర్​ వచ్చినా భయపడకుండా దాన్ని జయించాడు. మళ్లీ మైదానంలో అడుగు పెట్టి ప్రత్యర్థి బౌలర్లను ఆటాడుకున్నాడు. యువీ ఆటలోనే కాదు సేవలోనూ ముందున్నాడు. పేదవారికి సాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.

ఇదీ చదవండి:srisailam dam: నిండుకుండలా శ్రీశైలం జలాశయం.. గేట్లు ఎత్తే అవకాశం

ABOUT THE AUTHOR

...view details