ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఆయన వల్లే.. కేంద్రం విభజన హామీలు అమలు చేయడం లేదు: ఎంపీ విజయసాయి

By

Published : Aug 8, 2022, 5:59 PM IST

MP VIJAYASAI REDDY: కాంగ్రెస్‌ ఎంపీ జైరాం రమేశ్‌ విభజన చట్టాన్ని తప్పుల తడకగా రాయడం వల్లే ఎన్డీఏ ప్రభుత్వం విభజన హామీలు అమలు చేయడం లేదని.. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్జి అన్నారు. ఒడిశాలోని గనుల నుంచి రైల్వేశాఖ బొగ్గు సరఫరా చేయకపోవడం వల్లే.. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ల రెండు ఫర్నేస్‌లు మూతబడ్డాయని అన్నారు.

MP VIJAYASAI REDDY
MP VIJAYASAI REDDY

MP Vijayasai Reddy on Jairam Ramesh: కాంగ్రెస్​ ఎంపీ జైరాం రమేశ్‌ ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టాన్ని తప్పుల తడకగా రూపొందించారని వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. 'Shall' అని ఉండాల్సిన ప్రతీచోట.. 'may' అనే పదాన్ని ఉపయోగించారని.. ఎన్డీఏ ప్రభుత్వం దీన్ని అవకాశంగా తీసుకుని విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ ఏర్పాటు చేయడం లేదని తెలిపారు. జైరాం రమేశ్‌ విస్మరించిన అంశాల వల్ల.. ఆంధ్రప్రదేశ్‌ మూల్యం చెల్లించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుని.. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటు చేయాలని కోరారు.

ఎంపీ జైరాం రమేశ్‌ వల్లే.. కేంద్రం విభజన హామీలు అమలు చేయడంలేదు

ABOUT THE AUTHOR

...view details