ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Gangi Reddy Petition in High Court: సీబీఐ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది.. హైకోర్టులో గంగిరెడ్డి పిటిషన్

By

Published : Dec 14, 2021, 3:33 PM IST

Updated : Dec 14, 2021, 7:45 PM IST

Gangi Reddy Petition in High Court: వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. అప్రూవర్‌గా మారిన దస్తగిరికి సీబీఐ క్షమాభిక్ష పెట్టడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్​పై ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. సీబీఐ సమయం కోరటంతో.. తదుపరి విచారణను వాయిదా వేసింది.

Gangi Reddy Petition in High Court
Gangi Reddy Petition in High Court

Gangi Reddy Petition in High Court: వైఎస్‌ వివేకా అనుచరుడు గంగిరెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అప్రూవర్‌గా మారిన దస్తగిరికి సీబీఐ క్షమాభిక్ష పెట్టడాన్ని సవాల్ చేశారు. సీబీఐ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. ఈ కేసులో కౌంటర్‌ దాఖలు చేసేందుకు సమయం కావాలని సీబీఐ కోరింది. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం.. విచారణను వాయిదా వేసింది.

Erra Gangireddy quash petition in high court: ఇదే కేసుకు సంబంధించి డిసెంబర్​ 2వ తేదీన ఎర్ర గంగిరెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన డ్రైవర్ దస్తగిరి.. ఉద్దేశపూర్వకంగా తనను ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని గంగిరెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు.

ముగ్గురి రిమాండ్ పొడిగింపు

వివేకా హత్య కేసులో ముగ్గురు నిందితుల రిమాండ్​ను పులివెందుల కోర్టు పొడిగించింది. ఇందులో శివశంకర్‌రెడ్డి, సునీల్, ఉమాశంకర్‌ ఉన్నారు. వీరి రిమాండ్ గడువు ఈ నెల 28 వరకు పొడిగించింది. ఈ కేసులో శివశంకర్‌రెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి బెయిల్ పిటిషన్లపై వాదనలు ముగిశాయి. వీరి బెయిల్ పై నిర్ణయాన్ని ఈనెల 21కి కడప కోర్టు వాయిదా వేసింది.

Vivekaa PA Complaint to Kadapa SP: మరోవైపు ఈ కేసులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. వివేకా కుమార్తె సునీత, భర్త రాజశేఖర్ రెడ్డి, శివప్రకాష్ రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ సోమవారం.. వివేకా పీఏ కృష్ణారెడ్డి కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్​కు ఫిర్యాదు చేశారు. కొంతకాలంగా వివేకా హత్యకేసులో సీబీఐకి సాక్ష్యం చెప్పాలంటూ తనపై ఒత్తిడి తెస్తున్నారని కృష్ణారెడ్డి లేఖలో పేర్కొన్నారు. ఎస్పీని కలిసిన తర్వాత కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాకుండానే వెళ్లిపోయారు.

SP Anburajan On Vivekaa PA Complaint: వివేకా పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదుకు సంబంధించిన వివరాలను ఎస్పీ అన్బురాజన్ వెల్లడించారు. కృష్ణారెడ్డి ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదు చేశారని వెల్లడించారు. ఆయన వివేకా ఇంట్లో 30 ఏళ్లుగా పని చేస్తున్నారని.. హత్య కేసులో కృష్ణారెడ్డి అనుమానితుడిగా ఉన్నాడని పేర్కొన్నారు. కృష్ణారెడ్డి ఫిర్యాదుపై అన్ని కోణాల్లో విచారించి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

Flight Diverted: ఎమ్మెల్యే రోజా ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య

Last Updated : Dec 14, 2021, 7:45 PM IST

ABOUT THE AUTHOR

...view details