ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కాళేశ్వరం ప్రాజెక్టు కుంభకోణంపై భాజపా తాత్సారమెందుకన్న షర్మిల

By

Published : Oct 7, 2022, 8:49 PM IST

YS Sharmila on Kaleshwaram Project Scam: కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని వైతెపా అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. అవినీతి స్పష్టంగా కనిపిస్తున్నా భాజపా పెద్దలు విచారణ, చర్యలు తీసుకోవడంలో తాత్సారమెందుకని ప్రశ్నించారు. ఈ మేరకు దిల్లీలో సీబీఐ డైరెక్టర్​తో సమావేశమైన షర్మిల.. తెలంగాణలో ప్రాజెక్టుల పేరుతో అవినీతికి పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు.

Sharmila
Sharmila

YS Sharmila on Kaleshwaram Project Scam: కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని.. వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. అవినీతి స్పష్టంగా కనిపిస్తున్నా భాజపా పెద్దలు విచారణపై తాత్సారమెందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ మేరకు... దిల్లీలో సీబీఐ డైరెక్టర్‌ను కలిసిన షర్మిల.. తెలంగాణలో ప్రాజెక్టుల పేరుతో అవినీతికి పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్ల అవినీతి జరిగిందని.. షర్మిల ఆరోపించారు.

'ఎందుకు మీరు (భాజపా).. ముఖ్యమంత్రిని కాపాడుతున్నారు? కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎందుకు విచారణ జరిపించడం లేదు? ఇది దేశంలోనే అతిపెద్ద కుంభకోణం. దేశానికి నష్టం కలిగించిన లక్ష కోట్ల రూపాయల గురించి నేను మాట్లాడుతున్నాను. అది పన్ను చెల్లింపుదారుల డబ్బు. ఎందుకు దీనిపై ఎవరూ చర్యలు తీసుకోవడం లేదు. సీబీఐకి ఇచ్చిన సమగ్ర ఫిర్యాదులో ప్యాకేజీ నంబర్లు, అంకెలతోపాటు మేము సేకరించిన పూర్తి సమాచారం అందించాం. ఎందుకు మీరు(భాజపా) చర్యలు తీసుకోలేకపోతున్నారు.'-షర్మిల, వైతెపా అధ్యక్షురాలు

Sharmila

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details