ETV Bharat / city

బాక్సాఫీస్​పై "గాడ్​ఫాదర్" దండయాత్ర.. మెగా హిస్టరీలో టాప్-10 మూవీస్ ఇవే!

author img

By

Published : Oct 7, 2022, 4:07 PM IST

Updated : Oct 7, 2022, 6:25 PM IST

"ఆచార్య"తో ప్రేక్షకులతోపాటు ఫ్యాన్స్​ను నిరాశకు గురిచేసిన మెగాస్టార్ చిరంజీవి.. "గాడ్​ఫాదర్​"తో దుమ్ములేపుతున్నారు. విజయదశమి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద వీరవిహారం చేస్తోంది. ఈ నేపథ్యంలో.. విడుదలైన రెండు రోజుల్లో గాడ్​ఫాదర్ సాధించిన కలెక్షన్స్​తోపాటు.. మెగా కెరియర్​లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన టాప్-10 మూవీస్ లిస్ట్ చూద్దాం.

godfather
గాడ్​ ఫాదర్​

godfather
గాడ్​ ఫాదర్​

రీమేక్ అంటే.. సగటు ప్రేక్షకుడు ఏం ఫీలవుతాడంటే.. ఒరిజినల్ మూవీలోని ఆర్టిస్టులు మాత్రమే మారుతారని భావిస్తాడు. కానీ.. లూసీఫర్​ విషయంలో మాత్రం "కథ" వేరే! ఒరిజినల్ వెర్షన్​లోని సోల్ మాత్రమే తీసుకున్న దర్శకుడు.. సినిమా మొత్తం మార్చిపడేశాడు. ఎంతలా ఛేంజ్ చేశాడంటే.. లూసీఫర్ చూసి వచ్చినవారు కూడా.. "గాడ్​ఫాదర్​"ను క్యూరియాసిటీతో ఎంజాయ్ చేసేంతగా మలిచారు. అందుకే.. రీమేక్ అయినా.. రికార్డు కలెక్షన్స్​ తో దూసుకెళ్తోంది.

godfather
గాడ్​ఫాదర్

మరి, గాడ్​ఫాదర్ చిత్రం ఇప్పటి వరకు ఎంత కలెక్ట్ చేసింది.. అన్న వివరాలతోపాటు.. చిరంజీవి టాప్​-10 మూవీస్ లిస్ట్ ఇక్కడ ఉంది. వికీపిడీయా, గూగుల్​, మరికొన్ని బాక్సాఫీస్​ వెబ్​సైట్ల లెక్కల ప్రకారం ఈ డేటాను అందిస్తున్నాం.

godfather
గాడ్ ఫాదర్ మేకింగ్ స్టిల్

రిలీజ్​ అయిన ప్రతిచోటా పాజిటివ్​ టాక్ తెచ్చుకున్న "గాడ్​ఫాదర్".. వ‌రల్డ్ వైడ్‌గా కలెక్షన్లలో దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్​ డే రూ.38 కోట్లు గ్రాస్ రాబట్టిందని అంచనా. సెకండ్​ డే.. వరల్డ్ వైడ్ గా రూ.31 కోట్లు రాబట్టిందని ట్రేడ్ అనలిస్టులు లెక్కలు కట్టారు.

godfather
గాడ్ ఫాదర్

అయితే.. ఫస్ట్​ డేతో పోలిస్తే.. సాధారణంగా రెండో రోజున కలెక్షన్లు 20 నుంచి 30 శాతం పడిపోతాయి. కానీ.. "గాడ్ ఫాదర్" సెకండ్​ డే కూడా బాక్సాఫీస్​ను షేక్ చేసింది. మొత్తంగా.. రెండు రోజుల్లో రూ.69 కోట్ల గ్రాస్ రాబట్టి.. మెగా వేవ్ కొనసాగిస్తోంది గాడ్ ఫాదర్.

godfather
గాడ్ ఫాదర్ మేకింగ్ స్టిల్

తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ చూస్తే.. రూ.34.75 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్టు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. షేర్ విషయానికి వస్తే.. రూ. 20.70 కోట్లు అని లెక్కలు కడుతున్నారు. ఏరియాల వైజ్​గా చూస్తే..

godfather
గాడ్​ ఫాదర్​

నైజాం - రూ. 5.67 కోట్లు
సీడెడ్ - రూ.5.14 కోట్లు
ఉత్తరాంధ్ర - రూ. 2.27 కోట్లు
గుంటూరు - రూ. 2.35 కోట్లు
కృష్ణా - రూ. 1.22 లక్షలు
నెల్లూరు - రూ. 90 లక్షలు
ఈస్ట్ - రూ. 2.11 కోట్లు
వెస్ట్ - రూ 1.04 కోట్లు
క‌ర్ణాట‌క - రూ. 2.30 లక్షలు
రెస్టాఫ్ ఇండియా - రూ.1.80 లక్షలు

godfather
గాడ్​ ఫాదర్​

సైరా : మెగాస్టార్ కెరీర్​లో తొలి పాన్​ ఇండియా చిత్రంగా రిలీజైన హిస్టారికల్ మూవీ సైరా. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్రతో తెరకెక్కిన ఈ మూవీ.. ప్రపంచవ్యాప్తంగా 140 కోట్ల షేర్ రాబట్టింది.

saira
సైరా
saira
సైరా

ఇప్పటి వరకూ చిరంజీవి కెరీర్లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచిపోయింది సైరా!

ఖైదీ నంబర్ 150 : దాదాపు దశాబ్ద కాలంపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న తర్వాత.. రీ-ఎంట్రీలో చిరంజీవి నటించిన ఫస్ట్ మూవీ ఇది. తమిళ్ స్టార్ విజయ్ నటించిన "కత్తి" చిత్రానికి రీమేక్ ఇది.

150
ఖైదీ నెంబర్ 150
150
ఖైదీ నెంబర్ 150

బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్​ గా నిలిచిన ఈ చిత్రం.. 104 కోట్ల షేర్ రాబట్టి.. దుమ్ము లేపింది.

ఇంద్ర : మెగాస్టార్ కెరియర్లో.. తొలిసారి రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్​తో తెరకెక్కిన చిత్రం ఇంద్ర. చిరంజీవి బిగ్గెస్ట్ హిట్లలో ఇంద్రకు ప్రత్యేక స్థానం ఉంటుంది.

indra
ఇంద్ర
indra
ఇంద్ర

2002లో విడుదలైన ఈ మూవీకి.. 13 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. విడుదలైన ప్రతిచోటా బాక్సాఫీస్​ ను షేక్​ చేసిన ఈ చిత్రం.. రూ.27 కోట్ల షేర్ రాబట్టింది.

శంకర్​దాదా MBBS : కామెడీని పండించే స్టార్ హీరోల్లో.. చిరంజీవి ముందు వరసలో ఉంటారు. అలాంటి ఫుల్ లెంగ్త్ రోల్​లో మెగాస్టార్ నటించిన చిత్రం శంకర్​దాదా MBBS.

shankar dada mbbs
శంకర్​దాదా ఎంబీబీఎస్​

బాలీవుడ్ చిత్రం మున్నాభాయ్ ఎంబీబీఎస్​ కు రీమేక్​గా వచ్చిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. ఈ చిత్రానికి రూ.14 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగితే.. ఏకంగా 26 కోట్ల షేర్ ను వసూలు చేసింది.

ఠాగూర్ : తెలుగు సినిమాల్లో ప్రజలకు సందేశం ఇవ్వడం అనేదే ఎప్పుడో తరచుగా జరిగేది. అది కూడా ఓ పాత్రకు మాత్రమే పరిమితమయ్యేది. కానీ.. పూర్తిస్థాయిలో అదే కంటెంట్ తో తెరకెక్కిన మెగా మూవీ "ఠాగూర్".

tagur
ఠాగూర్​
tagur
ఠాగూర్​

తమిళ్ మూవీ "రమణ"కు రీమేక్​ అయినప్పటికీ.. తెలుగు నేటివీటికి తగ్గట్టుగా మార్చారు. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ఈ మూవీ.. రూ.24 కోట్లు రాబట్టింది.

స్టాలిన్ : తమిళ దర్శకుడు మురుగదాస్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం స్టాలిన్. చిరు-మురుగదాస్ కాంబోలో రూపొందిన చిత్రం కావడంతో అంచనాలు తారస్థాయికి చేరాయి. ఈ చిత్రానికి అప్పట్లోనే రూ.30 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కానీ.. కేవలం 23 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.

stalin
స్టాలిన్​

శంకర్​ దాదా జిందాబాద్ : ఎంబీబీఎస్ కు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా.. ఫస్ట్ పార్ట్ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో.. శంకర్ దాదా జిందాబాద్ చిత్రం కేవలం 18 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది.

shankar dada
శంకర్​దాదా జిందాబాద్​

అన్నయ్య : అన్నాదమ్ముల అనుబంధాన్ని వివరిస్తూ వచ్చిన చిరంజీవి చిత్రం.. "అన్నయ్య". రవితేజ, వెంకట్ మెగా బ్రదర్స్​గా నటించారు.

ma annayya
మా అన్నయ్య
ma annayya
మా అన్నయ్య

అన్నయ్య మూవీకి రూ.10 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరగ్గా.. 13 కోట్ల షేర్ రాబట్టింది.

జైచిరంజీవ : ఈ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలైనప్పటికీ.. అనుకున్నంత విజయం సాధించలేకపోయింది.

jai chiranjeeva
జై చిరంజీవ

18 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగితే.. కేవలం 12కోట్ల షేర్ ను మాత్రమే వసూలు చేసింది.

అంజి : ఎన్నో వాయిదాల అనంతరం విడుదలైన మెగా సోషియో ఫాంటసీ చిత్రం అంజి. ఇంద్ర, ఠాగూర్ వంటి వరుస విజయాల తర్వాత వచ్చిన ఈ చిత్రానికి బిజినెస్ భారీగానే సాగింది. రూ.24 కోట్ల వ్యాపారం జరిగింది. కానీ.. కేవలం 12 కోట్లు మాత్రమే వసూలు చేసింది.

anji
అంజి
anji
అంజి
anji
అంజి
Last Updated : Oct 7, 2022, 6:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.