ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ganesh immersion: వినాయక నిమజ్జనం.. రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్

By

Published : Sep 18, 2021, 8:21 PM IST

హైదరాబాద్​లో గణేశ్​ నిమజ్జనం పురస్కరించుకుని మద్యం దుకాణాలు, పబ్బులు మూసివేయాలని పోలీసు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు రేపటి నుంచి ఎల్లుండి సాయంత్రం వరకు దుకాణాలు బంద్ కానున్నాయి.

వినాయక నిమజ్జనం
వినాయక నిమజ్జనం

వినాయక నిమజ్జనం (Ganesh Immerison) సందర్భంగా హైదరాబాద్​ వ్యాప్తంగా వైన్స్, పబ్బులు బంద్​ కానున్నాయి (Wines,Pubs Closed). గణేశ్​ నిమజ్జనం సందర్భంగా బార్లు, కల్లు దుకాణాలు మూతపడనున్నాయి. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి ఎల్లుండి సాయంత్రం 6 గంటల వరకు బంద్ కొనసాగుతుంది. హైదరాబాద్ మహా నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో వైన్స్, బార్లు, పబ్బులు, కల్లు దుకాణాలు మూసివేయాలి ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు ఆయా పోలీస్ కమిషనర్లు నోటిఫికేషన్ జారీ చేశారు.

ట్రాఫిక్ ఆంక్షలు..

వినాయక నిమజ్జనానికి(Ganesh immersion) హైదరాబాద్​లో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. గణేశ్ నిమజ్జనం సందర్భంగా నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. శనివారం అర్దరాత్రి నుంచే నగరంలోకి అంతర్​రాష్ట్ర, జిల్లాల వాహనాలపై ప్రవేశాన్ని నిషేధించనున్నారు. పలుచోట్ల ఆర్టీసీ బస్సులను దారి మళ్లించనున్నారు. విమానాశ్రయం, రైల్వే స్టేషన్లకు వెళ్లే ప్రయాణికులు గణేశ్ నిమజ్జన యాత్ర మీదుగా రాకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేస్తున్నారు.

గణేశ్ నిమజ్జనం(Ganesh immersion) సందర్భంగా.. దారి మళ్లింపు.. ట్రాఫిక్ ఆంక్షల గురించి తెలుసుకునేందుకు, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కంట్రోల్ రూమ్​ను ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం 40-27852482, 9490598985, 9010303626 నంబర్లను సంప్రదించాలని సూచించారు. దారి మళ్లింపులు, ట్రాఫిక్ ఆంక్షలను గూగుల్ మ్యాప్​తో అనుసంధానమై ఎప్పటికప్పుడు అప్​డేట్ చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి:Ganesh immersion in TS: గణేశ్ నిమజ్జనం.. భాగ్యనగరంలో ట్రాఫిక్ ఆంక్షలివే

ABOUT THE AUTHOR

...view details