ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Mansas Trust Case: హైకోర్టు తీర్పుపై అప్పీల్‌కు వెళ్తాం: మంత్రి వెల్లంపల్లి

By

Published : Jun 14, 2021, 3:35 PM IST

Updated : Jun 14, 2021, 3:55 PM IST

Mansas Trust Case
minister vellampalli srinivasa rao

15:31 June 14

ముఖ్యమంత్రి జగన్‌ను కలిసిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్

మాన్సాస్ ట్రస్టు (Mansas Trust) అంశంలో హైకోర్టు (ap high court) తీర్పుపై అప్పీలుకు వెళ్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు (minister vellampalli srinivasa rao) తెలిపారు. హైకోర్టు తీర్పును పరిశీలించి ముందుకు వెళ్తామన్నారు. అప్పీల్​లో తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందన్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (cm ys jagan) ను కలిసిన మంత్రి.. పలు అంశాలపై చర్చించారు. మాన్సాస్ ట్రస్టుకు సంబంధించిన పలు అంశాలను వివరించారు.  

అనుబంధ కథనం:మాన్సాస్‌ ట్రస్టు ఛైర్మన్‌.. సంచయిత గజపతిరాజు నియామక జీవో రద్దు

నిబంధనల ప్రకారమే

బ్రహ్మంగారి మఠం (brahmamgari matam)పీఠాధిపతి వివాదంపై సీఎం ఆరా తీశారని మంత్రి వెల్లంపల్లి తెలిపారు. చోటు చేసుకుంటున్న పరిణామాలన్నింటినీ సీఎంకు తెలియజేశామన్నారు. నిబంధనల  ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించినట్లు చెప్పారు. బ్రంహ్మంగారి మఠం పీఠాధిపతి ఎంపికపై ప్రభుత్వం మఠాధిపతులతో కమిటీ నియమించిందన్నారు. నిబంధనలు, సాంప్రదాయాల ప్రకారం పీఠాధిపతిని నియమిస్తామన్నారు. 

ఇదీ చదవండి

Mansas Trust: ఇప్పటికైనా ప్రభుత్వం.. చట్టాలను, రాజ్యాంగాన్ని గౌరవించాలి: అశోక్ గజపతిరాజు

Last Updated : Jun 14, 2021, 3:55 PM IST

ABOUT THE AUTHOR

...view details