ఆంధ్రప్రదేశ్

andhra pradesh

టీఎస్​ఆర్టీసీ కీలక నిర్ణయం.. బస్సుల్లో డిజిటల్ చెల్లింపులు.. ఎప్పటినుంచంటే?

By

Published : Oct 15, 2022, 4:21 PM IST

TSRTC given green signal for digital payments: నగర బస్సుల్లో డిజిటల్‌ చెల్లింపులను స్వీకరించేందుకు తెలంగాణ ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ సిద్ధమైంది. ఈ సదుపాయం వచ్చే నెలలో అందుబాటులోకి రానుందని సికింద్రాబాద్‌ రీజియన్‌ మేనేజర్‌ వెంకన్న తెలిపారు.

digital payments in tsrtc
digital payments in tsrtc

TSRTC given green signal for digital payments: నగర బస్సుల్లో డిజిటల్‌ చెల్లింపులను స్వీకరించేందుకు తెలంగాణ ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ సిద్ధమైంది. ఈ సదుపాయం వచ్చే నెలలో అందుబాటులోకి రానుందని సికింద్రాబాద్‌ రీజియన్‌ మేనేజర్‌ వెంకన్న తెలిపారు. క్రెడిట్‌, డెబిట్‌ కార్డుతోపాటు.. ఫోన్‌పే, గూగుల్‌పే ఇలా ఆన్‌లైన్లో చెల్లింపులకు అవకాశం కల్పిస్తామన్నారు. ఇప్పటికే దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో ఐటిమ్స్‌(ఇంటలిజెన్స్‌ టిక్కెట్‌ ఇష్యూ మెషిన్స్‌) వాడి డిజిటల్‌ చెల్లింపులకు అవకాశం కల్పిస్తున్నామమని పేర్కొన్నారు. ఇలా చిల్లర సమస్యలకు చెక్‌ పెట్టడమే కాకుండా.. ఈ మెషిన్ల ద్వారా మరిన్ని సేవలను బస్సులోనే అందుబాటులోకి తెస్తున్నామన్నారు.

దూర ప్రాంత ప్రయాణాలకు రిజర్వేషన్లు
ఇక నుంచి సిటీ బస్సులతోపాటు దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల రిజర్వేషన్లు కూడా చేసుకోవచ్చు. అంతే కాదు.. బస్సు పాస్‌ల పునరుద్ధరణ(రెన్యూవల్‌)కు కౌంటర్ల ముందు బారులు తీరాల్సిన పని లేకుండా.. సిటీ బస్సుల్లోనే అవకాశం కల్పిస్తున్నామని వెంకన్న తెలిపారు. మియాపూర్‌-1, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ, బీహెచ్‌ఈఎల్‌, కుషాయిగూడ డిపోల నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో ఇప్పటికే ప్రయోగాత్మకంగా డిజిటల్‌ చెల్లింపులు విజయవంతంగా అమలు చేశామని వివరించారు. విమానాశ్రయానికి వెళ్లే బస్సుల్లోనూ డిజిటల్‌ చెల్లింపుల విధానం ఇప్పటికే అమలు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details