ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నేడు టీఎస్‌పీఎస్సీ కీలక భేటీ...గ్రూప్‌ 1 ప్రకటనపై స్పష్టతకు అవకాశం

By

Published : Apr 23, 2022, 9:10 AM IST

Tspsc group1: టీఎస్‌పీఎస్సీ నేడు కీలక సమావేశం నిర్వహించనుంది. గ్రూప్‌ 1 ప్రకటనపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రెండు, మూడు కేటగిరీల పోస్టులపై కొంత స్పష్టత రావాల్సి ఉంది.

Tspsc group1
టీఎస్‌పీఎస్సీ నేడు కీలక సమావేశం

Tspsc group1: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇవాళ కీలక సమావేశం నిర్వహించనుంది. తెలంగాణ తొలి గ్రూప్ 1 ప్రకటన జారీకి వీలుగా ప్రభుత్వ శాఖల నుంచి వచ్చిన సవరణ ప్రతిపాదనల్ని పరిశీలిస్తుంది. విద్యార్హతలు, వయోపరిమితి, ప్రభుత్వ ఉత్తర్వులను సరిచూసి ఏమైనా లోటుపాట్లు ఉన్నాయేమో అధికారులు గుర్తిస్తారు. అన్నీ అనుకూలంగా ఉంటే గ్రూప్ 1 ప్రకటన జారీపై స్పష్టమైన నిర్ణయం వెలువడే అవకాశముంది.

ఒకవేళ ఏమైన లోటుపాట్లు ఉంటే రెండు మూడు రోజుల సమయమిచ్చి సమగ్రమైన ప్రతిపాదనలు తీసుకుంటారు. గ్రూప్ 1లో 19 విభాగాలకు చెందిన 503 పోస్టులు ఉన్నాయి. ఇందులో రెండు, మూడు కేటగిరీల పోస్టులపై కొంత స్పష్టత రావాల్సి ఉంది. ఏప్రిల్ నెలాఖరు నాటికి నోటిఫికేషన్ ఇచ్చేందుకు సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ వర్గాలు తెలిపాయి.

ఇదీ చదవండి: 'ఆ యువతి పెళ్లి విషయంలో జోక్యం చేసుకోవద్దు'

ABOUT THE AUTHOR

...view details