ఆంధ్రప్రదేశ్

andhra pradesh

White challenge issue: ప్రత్యేక బృందాలతో విచారణ చేస్తే బండారం బయటపడేది: టీపీసీసీ రేవంత్

By

Published : Sep 20, 2021, 8:45 PM IST

వైట్​ ఛాలెంజ్​లో భాగంగా... తెలంగాణ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి (Tpcc chief Revanth Reddy) గన్​పార్క్​ అమరవీరుల స్థూపం వద్దకు వెళ్లారు. ఆయన వెంట కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ (Congress leader Shabbir Ali) కూడా ధర్నలో (protest) పాల్గొన్నారు. రేవంత్​ వైట్​ ఛాలెంజ్​ను (revanth reddy White challenge) స్వీకరించిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సైతం అక్కడికి వెళ్లారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు చేశారు.

ప్రత్యేక బృందాలతో విచారణ చేస్తే బండారం బయటపడేది
ప్రత్యేక బృందాలతో విచారణ చేస్తే బండారం బయటపడేది

ప్రత్యేక బృందాలతో విచారణ చేస్తే బండారం బయటపడేది

ఆదర్శవంతమైన, పారదర్శకమైన తెలంగాణ కోసం యువతకు విశ్వసం కల్పించేందుకే మంత్రి కేటీఆర్​, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డికి వైట్‌ ఛాలెంజ్‌ విసిరినట్టు తెలంగాణ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి (Tpcc chief Revanth Reddy) స్పష్టంచేశారు. హైదరాబాద్‌ గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వద్ద కాంగ్రెస్‌ చేపట్టిన ధర్నాలో రేవంత్‌ పాల్గొన్నారు. రాష్ట్రంలో మాదకద్రవ్యాలు నిషేధించాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్‌ కార్యకర్తలు.. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ (drugs free telangana) అంటూ బ్యానర్లు ప్రదర్శించారు.

స్వచ్ఛందంగా నిరూపించుకుందాం

మరోవైపు రేవంత్‌ విసిరిన వైట్‌ ఛాలెంజ్‌ను (revanth reddy White challenge) స్వీకరించినకొండా విశ్వేశ్వరరెడ్డి... గన్​పార్క్​ వద్దకు వెళ్లారు. దీన్ని మంత్రి కేటీఆర్​ కూడా స్వీకరించి వస్తే బాగుండేదని అన్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీఎస్పీ నేత ఆర్​ ఎస్​ ప్రవీణ్‌కుమార్‌కు వైట్‌ ఛాలెంజ్‌ విసురుతునట్టు తెలిపారు. డ్రగ్స్ పరీక్షల కోసం వైద్యులకు నమూనాలు ఇద్దామని రేవంత్​ పేర్కొన్నారు. డ్రగ్స్ వాడట్లేదని స్వచ్ఛందంగా నిరూపించుకుందామన్నారు.

రాష్ట్ర ఆవిర్భావం తొలినాళ్లలో డ్రగ్స్ వ్యాపారాల్లో పెద్దల హస్తం ఉంది. అకున్ సబర్వాల్‌ను సిట్ అధికారిగా నియమించారు. విచారణ మధ్యలో అకున్ సబర్వాల్‌ను బదిలీ చేశారు. డ్రగ్స్ అమ్మకాలకు పబ్‌లు కేంద్రాలుగా మారాయి. పబ్‌ల వెనుక ఇతర రాష్ట్రాలు, దేశాల శక్తులు ఉన్నాయి. చీకటి సామ్రాజ్యాన్ని ఛేదించాలని చెప్పాం. ప్రత్యేక బృందాలతో విచారణ చేస్తే బండారం బయటపడేది. డ్రగ్స్‌పై 2017లో హైకోర్టులో పిల్ దాఖలు చేశాను. విచారణ చేయించి చర్యలు తీసుకునే బాధ్యత కేటీఆర్‌కు లేదా?

- రేవంత్‌ రెడ్డి, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు

డ్రగ్స్ వ్యాపారాల్లో పెద్దల హస్తం

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తొలినాళ్లలో డ్రగ్స్ వ్యాపారాల్లో పెద్దల హస్తం ఉందని ఆరోపించారు. గుడుంబా, మాదకద్రవ్యాల వ్యాపారాల్లో పెద్దల హస్తం ఉందని పేర్కొన్నారు. అకున్ సబర్వాల్‌ను సిట్ అధికారిగా నియమించారని గుర్తు చేశారు. కానీ విచారణ మధ్యలో అకున్ సబర్వాల్‌ను బదిలీ చేశారని తెలిపారు. డ్రగ్స్ అమ్మకాలకు పబ్‌లు కేంద్రాలుగా మారాయన్నారు. పబ్‌ల వెనుక ఇతర రాష్ట్రాలు, దేశాల శక్తులు ఉన్నాయన్నారు. చీకటి సామ్రాజ్యాన్ని ఛేదించాలని చెప్పామన్నారు. ప్రత్యేక బృందాలతో విచారణ చేస్తే బండారం బయటపడేదని వెల్లడించారు. డ్రగ్స్‌పై 2017లో హైకోర్టులో పిల్ దాఖలు చేసినట్లు గుర్తు చేశారు. విచారణ చేయించి చర్యలు తీసుకునే బాధ్యత కేటీఆర్‌కు లేదా అని మండిపడ్డారు.

ఇవీ చూడండి:

సొంత పార్టీ ఎంపీపై ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సంచలన వ్యాఖ్యలు

ABOUT THE AUTHOR

...view details