ఆంధ్రప్రదేశ్

andhra pradesh

TOP NEWS: ప్రధాన వార్తలు @ 9 AM

By

Published : Jun 24, 2022, 9:21 AM IST

TOP NEWS

.

  • నేడు మంత్రివర్గ సమావేశం.. ఎజెండా ఇదే!
    Cabinet meeting: ఇవాళ రాష్ట్ర కేబినెట్​ సమావేశం జరగనుంది. పంచాయతీరాజ్ చట్టంలో సవరణలకు ఆమోదం తెలపనుంది. 'అమ్మఒడి', పలు రకాల ఒప్పందాలు, కేటాయింపులకు ఆమోదం తెలపనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇంకా.. పలు అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • అయ్యన్న ఇంటికి విశాఖ పోలీసులు.. ఆ కేసుల కోసమే!
    Ayyanna Patrudu: తెదేపా నేత అయ్యన్నపాత్రుడిపై మరో కేసు నమోదైంది. ఈ కేసులో సెక్షన్‌ 41ఎ నోటీసును అందజేసేందుకు విశాఖపట్నం త్రీటౌన్‌ పోలీసులు ఇద్దరు గురువారం రాత్రి నర్సీపట్నంలోని అయ్యన్న ఇంటికి వెళ్లారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • పోలవరం పరిహారంలో అక్రమాల కేసు: కోర్టులో లొంగిపోయిన తహసీల్దారు
    Polavaram project: పోలవరం నిర్వాసితులకు పరిహారంలో అక్రమాల కేసులో దేవీపట్నం తహసీల్దార్​ న్యాయస్థానంలో లొంగిపోయారు. వీర్రాజుకు జులై 7 వరకు కోర్టు రిమాండ్​ విధించింది. గుబ్బలంపాలెంలో కొత్త సర్వే నంబర్లు సృష్టించి రూ.2.24 కోట్లు కాజేసినట్లు ఫిర్యాదు రావడంతో పలువురు రెవెన్యూ అధికారులపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • ఎన్డీయే అభ్యర్థికి వైకాపా మద్దతు.. ప్రత్యేక హోదా లాంటి షరతు లేకుండానే..!
    ప్రత్యేక హోదా లాంటి షరతులేమీ లేకుండానే ఎన్టీయే తరఫు రాష్ట్రపతి అభ్యర్థిని బలపరచాలని నిర్ణయించింది వైకాపా. ద్రౌపదీ ముర్ము నామినేషన్‌కు పార్టీ తరఫున విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డిలు హాజరుకానున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • లోయలో పడిన బస్సు.. ఐదుగురు మృతి.. 47 మందికి గాయాలు
    Road Accident: ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్​టేక్​ చేస్తుండగా.. అదుపుతప్పి ఓ బస్సు లోయలో బోల్తా పడింది. మధ్యప్రదేశ్​లో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, 47 మంది గాయపడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • నేడే ద్రౌపదీ ముర్ము నామినేషన్.. జులై 1 నుంచి రాష్ట్రాల పర్యటన
    Droupadi Murmu news: అధికార ఎన్డీఏ తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము శుక్రవారం నామపత్రాలు దాఖలు చేయనున్నారు. ముర్ము నామినేషన్​పై మోదీ, అమిత్ షా, రాజ్​నాథ్, నడ్డా, ఉత్తర్​ప్రదేశ్, ఉత్తరాఖండ్ సీఎంలు సంతకాలు చేయనున్నారు. దిల్లీకి చేరుకున్న ముర్ము.. ఉపరాష్ట్రపతి, ప్రధానిని కలిశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • పిల్లల్లో 2 నెలల పాటు దీర్ఘకాలిక కొవిడ్‌ లక్షణాలు!
    Post Covid Symptoms In Children: కరోనా మహమ్మారి బారిన పడిన చిన్నారుల్లో వైరస్​ లక్షణాలు.. రెండు నెలల పాటు కనిపించే అవకాశముందని ఓ అధ్యయనం వెల్లడించింది. వారిలో కనీసం ఏదైనా ఒక్క అనారోగ్య లక్షణం.. రెండు నెలల పాటు కొనసాగినట్లు నిర్ధరించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • రూ.4.3లక్షల కోట్లకు భారత మీడియా, వినోద రంగం!
    భారత మీడియా, వినోద రంగం వాటా 2026 నాటికి రూ.4.30 లక్షల కోట్లకు చేరుకుంటుందని ఓ అధ్యయనం తేల్చింది. సంప్రదాయ మీడియాలో వృద్ధితోపాటే డిజిటల్‌ మీడియా, ఇంటర్నెట్‌, మొబైల్‌ ప్రకటనలు మరింత విస్తృతమవడం వల్ల ఇది సాధ్యమవుతుందని తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • క్రికెట్​కు పనికిరాడన్నవాడే కెప్టెన్​ అయ్యాడు.. ఎలా సాధ్యమైంది?
    అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన 20 ఏళ్ల యువకుడు. పట్టుమని పది మ్యాచ్‌లు ఆడలేదు. ఇంతలోనే విమర్శల వర్షం. నువ్వు క్రికెట్‌కు పనికిరావు, బద్దకస్తుడివి, నీ ఫుట్‌వర్క్‌ బాగోలేదు. నీకు జట్టులో చోటు కష్టం. వీటికి తోడు వరుస వైఫల్యాలు.. 2011 వన్డే ప్రపంచకప్‌ ఎంపిక కాని పరిస్థితి. కట్‌ చేస్తే.. 15 ఏళ్లు తిరిగేసరికి... భారత క్రికెట్‌లో ఇప్పుడు అతడొక సూపర్‌స్టార్‌. అన్ని ఫార్మాట్లలో టీమ్‌ఇండియాకు సారథి. ఆయనే రోహిత్ శర్మ. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • షారుక్‌ కోసం ఆ పాత్రలో దీపిక.. బాధలో రణ్​బీర్ కపూర్​​!
    బాలీవుడ్​ హిట్​ పెయిర్​ షారుక్​ ఖాన్, దీపికా పదుకొణె త్వరలోనే మరోసారి కలిసి నటించనున్నట్లు సమాచారం. షారుక్​ చిత్రంలో దీపిక ఓ ప్రత్యేక పాత్రలో మెరవనుందని తెలుస్తోంది. ఇక తన 'షంషేరా' చిత్రం విడుదల సందర్భంగా తండ్రి రిషి కపూర్​ను తలచుకొని భావోద్వేగానికి గురయ్యారు స్టార్ హీరో రణ్​బీర్​ కపూర్​. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details