ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ప్రధాన వార్తలు @9AM

By

Published : Jul 14, 2021, 8:53 AM IST

Updated : Jul 14, 2021, 8:59 AM IST

..

top news
ప్రధానవార్తలు @9AM

  • weather : బలహీనపడిన అల్పపీడనం..రెండురోజుల పాటు వర్షాలు
    ఉపరితల ఆవర్తనం ప్రభావంతో... నేడు, రేపు రాష్ట్రంలో మోస్తరు వానలు పడనున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Penna Cements‌ case: నాకు వ్యతిరేకంగా ఒక్క ఆధారమూ లేదు: సీఎం జగన్
    హైదరాబాద్ సీబీఐ కోర్టులో సీఎం జగన్ డిశ్ఛార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. పెన్నా సిమెంట్స్‌ కేసులో 94 మంది వ్యక్తుల సాక్ష్యాలను అధికారులు సేకరించారని ...అందులో ఏ ఒక్కరూ తనపై ఆరోపణలు చేయలేదని పేర్కొన్నారు. అందుకే ఐపీసీ సెక్షన్‌ 420 తనకు వర్తించదని... పెన్నా కేసు నుంచి తన పేరును తొలగించాలని నివేదించారు. నిబంధన ప్రకారమే లీజులు, రాయితీలు ఇచ్చారని ఆయన కోర్టులో తెలిపారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • DEBTS OF AP: అప్పుల గుప్పిట రాష్ట్రం.. రూ.17,750 కోట్లకు బహిరంగ మార్కెట్‌ రుణం
    రాష్ట్రం రుణాల ఊబిలో కొట్టుమిట్టాడుతోంది. బహిరంగ రుణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.17,750 కోట్లకు చేరుకుంది. రిజర్వ్​బ్యాంక్ నిర్వహించిన సెక్యూరిటీల వేలంలో రాష్ట్రం రూ.1,750 కోట్ల మేర రుణం పొందింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • నది సంద్రంలో నిర్వాసితుల విలవిల
    పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు తల్లడిల్లిపోతున్నారు. గోదావరి నీరు ఊళ్లను ముంచేస్తుండటంతో బతుకు జీవుడా అంటూ ఇళ్లను ఖాళీ చేసి తలోదిక్కుకు చేరుకుంటున్నారు. ఈ ప్రాజెక్టు కోసం భూములను, ఊళ్లను, జీవితాలను త్యాగం చేసినా తమ కష్టాలను పట్టించుకునే నాథుడే లేకపోయారని కన్నీటి పర్యంతం అవుతున్నారు. కుటుంబానికి రూ.10 లక్షల వరకు ఇస్తామని చెప్పిన పునరావాస ప్యాకేజీ నిధులూ అందలేదు. కాలనీల నిర్మాణమూ పూర్తి చేయలేదు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'ఉగ్రవాద నిరోధక చట్టాన్ని దుర్వినియోగం చేయొద్దు'
    చట్టాలను దుర్వినియోగం చేయరాదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్​ చంద్రచూడ్​ అన్నారు. ఒక్కరోజు, ఒక్క వ్యక్తి స్వేచ్ఛను కోల్పోయినా అది తీవ్రమైనదే అవుతుందన్నారు. అసమ్మతిని అణచివేసేందుకు క్రిమినల్‌ చట్టాలను ఉపయోగిస్తుంటే కోర్టులు తప్పకుంటా అడ్డుకుంటాయని చెప్పారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Covid-19: నిర్లక్ష్యంతో మూడో దశ అనివార్యం!
    కరోనా ముప్పు పూర్తిగా తొలగిపోక మునుపే ముందుజాగ్రత్తల పట్ల ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కొవిడ్‌ కేసులు, మరణాలు తగ్గిపోతున్నాయంటూ పలు రాష్ట్రాలు ఆంక్షలను సడలిస్తున్నాయి. జనం సైతం మామూలుగా బయటికి వస్తూ.. గుంపులుగా తిరిగేస్తున్నారు. వైరస్​ నియంత్రణలో కఠినంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వాలేమో ఏమీ పట్టనట్టు వేడుక చూస్తున్నాయి. ఈ క్రమంలో కొవిడ్​ మూడో దశ అనివార్యమని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఆ విషయంలో సీఎంతో విభేదించిన ఉపముఖ్యమంత్రి
    జనాభా నియంత్రణ విషయంలో బిహార్​ ఉపముఖ్యమంత్రి రేణుదేవి ఆ రాష్ట్ర సీఎం నితీశ్​ కుమార్​తో విభేదించారు. సంతానోత్పత్తి విషయంలో పురుషులకు కూడా మరింత అవగాహన పెంపొందించాలని అన్నారు. అయితే నితీశ్​ మాత్రం మహిళలకు ఈ విషయంలో అవగాహన ఉండాలని పేర్కొన్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఆరు గంటలు నిలబడి ఓటేస్తే అరెస్టు చేశారు!
    గతేడాది మార్చిలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో టెక్సాస్‌కు చెందిన హెర్విస్‌ రోగర్స్‌ అనే వ్యక్తి ఆరు గంటలు క్యూలో నిల్చుని మరి ఓటు వేశాడు. స్థానికి మీడియా కథనాలతో అప్పుడతను బాగా పాపులరయ్యాడు.. కానీ అతడు వేసిన ఓటు చట్టవిరుద్ధమని ఇటీవల తేలింది. దీంతో అతనికి 40ఏళ్లు జైలుశిక్ష పడే అవకాశముందని న్యాయనిపుణులు చెబుతున్నారు. 2018లో జరిగిన మధ్యంతర ఎన్నికలోనూ హెర్విస్‌ ఓటు వేసినట్లు పోలీసులు గుర్తించారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్​షిప్ భారత్​లోనే..
    2026 ప్రపంచ బ్యాడ్మింటన్​ ఛాంపియన్​షిప్​ (World Badminton Championship)కు భారత్​ ఆతిథ్యమివ్వనుంది. ఈ విషయాన్ని ప్రపంచ బ్యాడ్మింటన్​ సమాఖ్య(BWF) వెల్లడించింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Tanikella Bharani: రంగస్థలం నుంచి రంగుల ప్రపంచం దాకా
    నటుడితో పాటు, రచయిత, గాయకుడు, తాత్వికుడు ఇలా అనేక కోణాలు కలిగిన వ్యక్తి తనికెళ్ల భరణి. పాత్ర ఏదైనా అక్కడ మనకు కనిపించేది భరణి కాదు.. ఆ పాత్ర ప్రతిరూపమే. అంతలా మనల్ని ఆయన నటనతో మాయచేస్తారు. నేడు తనికెళ్ల భరణి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన సినీ కెరీర్​తో పాటు, వ్యక్తిగత జీవీతంపైనా ఓ లుక్కేద్దాం.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
Last Updated : Jul 14, 2021, 8:59 AM IST

ABOUT THE AUTHOR

...view details