ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Egg stuck in Throat : మహిళ ప్రాణం తీసిన కోడిగుడ్డు

By

Published : Oct 14, 2021, 12:37 PM IST

పండ్ల గింజలు, నాణేలు పిల్లల గొంతులో ఇరుక్కోవడం గురించి మనం చాలా సార్లు వింటుంటాం. కొన్నిసార్లు అవి బయటకు పోయి ప్రాణాలు దక్కుతాయి. మరికొన్నిసార్లు ఊపిరాడక కొందరు ప్రాణాలు కోల్పోతుంటారు. కానీ.. కోడిగుడ్డు గొంతు(Egg stuck in Throat)లో ఇరుక్కుని ఓ మహిళ మృతి చెందిన ఘటన తెలంగాణలోని నాగర్​కర్నూల్ జిల్లాలోని నేరళ్లపల్లిలో చోటుచేసుకుంది.

మహిళ ప్రాణం తీసిన కోడిగుడ్డు
మహిళ ప్రాణం తీసిన కోడిగుడ్డు

గొంతులో కోడిగుడ్డు(Egg stuck in Throat) ఇరుక్కుని ఓ మహిళ మృతి చెందారు. తెలంగాణలోని నాగర్‌కర్నూల్‌ జిల్లా తిమ్మాజిపేట మండలం నేరళ్లపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటన బుధవారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన నీలమ్మ(50) ఇంట్లో భోజనం చేస్తూ ఉడకబెట్టిన కోడిగుడ్డును తినేందుకు నోట్లో పెట్టుకోగా.. గొంతులోకి జారిపోయి ఇరుక్కుపోయింది. దీంతో ఆమె ఊపిరాడక అక్కడికక్కడే పడిపోయారు. కుటుంబ సభ్యులు గుర్తించి గొంతులో గుడ్డుని బయటికి తీసేలోగానే ఆమె మృత్యుఒడికి చేరుకున్నారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details