ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తెలంగాణ: ప్రేమ వివాహం... పరువు హత్య...!

By

Published : Sep 25, 2020, 10:41 AM IST

Updated : Sep 25, 2020, 11:28 AM IST

తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్​లోని గచ్చిబౌలిలో దారుణం జరిగింది. ఇటీవల ప్రేమ వివాహం చేసుకున్న ఓ యువకుడు శవమై కనిపించాడు. గురువారం రాత్రి అపహరణకు గురైన యువకుడు... ఇవాళ సంగారెడ్డిలో శవమయ్యాడు. ప్రేమ వివాహం ఇష్టంలేకనే తన తండ్రే... హత్య చేయించారని హేమంత్​ భార్య ఆరోపిస్తున్నారు.

ప్రేమవివాహం... పరువు హత్య...!
ప్రేమవివాహం... పరువు హత్య...!

హైదరాబాద్​లోని గచ్చిబౌలిలో దారుణం చోటు చేసుకుంది. ఇటీవల ప్రేమవివాహం చేసుకున్న హేమంత్‌ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. యువతి ప్రేమవివాహం వాళ్ల ఇంట్లో ఇష్టలేకపోవడం వల్ల వేరుగా ఉంటున్నారు. గచ్చిబౌలి టీఎన్‌జీవో కాలనీలో ఈ యువజంట నివాసం ఉంటుంది. గురువారం సాయంత్రం హేమంత్​ను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. హేమంత్​ కిడ్నాప్​పై గురువారం రాత్రి ఆయన బంధువులు గచ్చిబౌలి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కానీ ఇంతలో... సంగారెడ్డిలో యువకుడు శవమై కనిపించాడు. యువతి బంధువులే హత్య చేయించాడని హేమంత్‌ కుటుంబసభ్యుల ఆరోపించారు.

యువతి మేనమామ సహా 12 మందిని గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేశారు.

హేమంత్ భార్య

హేమంత్ భార్య ఆరోపణలు

'మా బావలు, వదినలు, మామయ్యలే ఈ హత్య చేయించారు. హేమంత్‌ను మా బంధువులు బలవంతంగా తీసుకెళ్లారు. నిన్న హేమంత్‌ను ఇద్దరు రౌడీలు కొట్టారు. నిందితులు కొల్లూరులో ఓఆర్‌ఆర్‌ ఎక్కి పటాన్‌చెరులో దిగారు. హేమంత్‌, నేను 8 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నాం. జూన్‌ 10న వివాహం చేసుకున్నాం. బీహెచ్‌ఈఎల్ సంతోషిమాత ఆలయంలో పెళ్లి చేసుకున్నాం. పెళ్లి తర్వాత చందానగర్ పీఎస్‌లో సెటిల్‌మెంట్‌కు చేసుకున్నాం. పెళ్లి ఇష్టం లేకుంటే నన్ను చంపాలి. ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది నేను, హేమంత్ కాదు. నా పేరిట ఉన్న ఆస్తులను కుటుంబసభ్యులకు రాసిచ్చేశాను.'---హేమంత్ భార్య

హేమంత్ తల్లి ఆవేదన

'మా అబ్బాయిని పొట్టనపెట్టుకున్నారు. అమ్మాయి బావ దారుణంగా మాట్లాడాడు. ఎన్నో ఆశలు పెట్టుకుని హేమంత్‌ను పెంచుకున్నాం. వేర్వేరు కులాల వల్లే హేమంత్‌ను హత్య చేశారు. ఇద్దరినీ కారులో తీసుకెళ్లారు, హేమంత్ భార్య కారునుంచి దూకేసింది. సందీప్‌రెడ్డి, రాకేశ్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి, యుగేందర్‌రెడ్డి, విజయేందర్‌రెడ్డే హత్య చేశారు.'---హేమంత్ తల్లి

ఇదీ చదవండి:అవినీతి నరసింహం ఆస్తుల కేసులో దర్యాప్తు ముమ్మరం

Last Updated :Sep 25, 2020, 11:28 AM IST

ABOUT THE AUTHOR

...view details