ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తెలంగాణ: పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో నిలిచేది ఎవరో తేలేది ఇవాళే..

By

Published : Feb 26, 2021, 7:04 AM IST

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ పోరులో బరిలో నిలిచేదెవరో నేడు తేలనుంది. ఎమ్మెల్సీ నామినేషన్ల ఉపసంహరణకు ఇవాళే చివరిరోజు.. ఎంత మంది బరిలో ఉంటారో ఇవాళ తేలిపోతుంది.

mlc elections in Telangana
తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ

తెలంగాణలో ఎమ్మెల్సీ నామినేషన్ల ఉపసంహరణకు నేటితో గడువు ముగుస్తుంది. పోటీలో ఎంత మంది ఉండేది నేటితో తేలిపోతుంది. మహబూబ్​నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల స్థానానికి 96 నామినేషన్లు దాఖలయ్యాయి. స్వతంత్ర అభ్యర్థి బెజగం నాగరాజు తన నామినేషన్​ను ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం నామినేషన్ల సంఖ్య 95కు చేరుకుంది.

వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 73 నామినేషన్లు దాఖలయ్యాయి. శుక్రవారం సాయత్రం... ఎన్నికల కమీషన్ బరిలో ఉన్న తుది అభ్యర్థుల జాబితాను ప్రకటించనుంది. మార్చి 14వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. మార్చి 17 తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

ఇదీ చూడండి:వైకాపా ఎమ్మెల్సీ అభ్యర్థిగా చల్లా భగీరథ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details