ఆంధ్రప్రదేశ్

andhra pradesh

TS Corona Cases: తెలంగాణలో తగ్గిన కరోనా వ్యాప్తి... కొత్తగా ఎన్ని కేసులంటే?

By

Published : Feb 8, 2022, 10:19 PM IST

TS Corona Cases: తెలంగాణలో కొవిడ్ వ్యాప్తి తగ్గింది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 69,892 కొవిడ్​ టెస్టులు చేయగా.. 1,061 మందికి పాజిటివ్​ నిర్ధారణ అయింది. మరొకరు మరణించారు.

TS Corona Cases
TS Corona Cases

TS Corona Cases: తెలంగాణలో కరోనా తగ్గుముఖం పడుతోంది. గత వారం మూడు వేలకుపైగా నమోదైన కేసులు ప్రస్తుతం తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 69,892 కొవిడ్​ టెస్టులు చేయగా.. 1,061 మందికి పాజిటివ్​ నిర్ధారణ అయింది. ఫలితంగా తెలంగాణలో మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 7,79,971కు చేరింది. వైరస్​ బారినపడి మరొకరు మృతిచెందగా.. మొత్తం మృతిచెందినవారి సంఖ్య 4,102కు చేరింది.

కరోనా నుంచి మరో 3,590 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 21,470 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. మరో 2,018 పరీక్షలు ఫలితాలు రావాల్సి ఉంది. గ్రేటర్​ హైదరాబాద్​ పరిధిలోనే 274 కరోనా కేసులు నమోదయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details