ఆంధ్రప్రదేశ్

andhra pradesh

జగన్, విజయసాయి బెయిల్ రద్దు పిటిషన్ల బదిలీకి తెలంగాణ హైకోర్టు నిరాకరణ

By

Published : Sep 15, 2021, 11:17 AM IST

Updated : Sep 15, 2021, 11:53 AM IST

rrr petition
rrr petition

11:12 September 15

జగన్, విజయసాయి బెయిల్ రద్దు పిటిషన్​

అక్రమాస్తుల కేసులో జగన్‌, విజయసాయిరెడ్డి బెయిల్‌ రద్దు కోరుతూ సీబీఐ కోర్టులో ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ల బదిలీకి తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. ఈ మేరకు పిటిషన్ల బదిలీ కోరుతూ రఘురామ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. బెయిల్‌ రద్దు పిటిషన్ల బదిలీకి హైకోర్టు నిరాకరించిన నేపథ్యంలో కాసేపట్లో సీబీఐ కోర్టు తీర్పు వెలువరించే అవకాశముంది.

        సీబీఐ కోర్టు తీర్పు వెల్లడించకుండా స్టే ఇవ్వడంతో పాటు..  బెయిల్‌ రద్దు పిటిషన్లను మరో కోర్టుకు బదిలీ చేయాలంటూ రఘురామ మంగళవారం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు నుంచి కేసు బదిలీ చేయాలంటే సహేతుకమైన కారణాలు ఉండాలని, ఇక్కడ అలాంటివేవీ లేకుండా ఊహాజనిత కారణాలతో బదిలీ కోరుతున్నారని ఉన్నత న్యాయస్థానం నిన్న వ్యాఖ్యానించింది. తాజాగా బెయిల్‌ రద్దు పిటిషన్‌ బదిలీని నిరాకరిస్తూ రఘురామ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. మరోవైపు ‘సాక్షి’ మీడియాపై దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ కేసును మాత్రం తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేస్తున్నట్లు ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. బెయిల్‌ రద్దు పిటిషన్ల బదిలీకి హైకోర్టు నిరాకరించిన నేపథ్యంలో కాసేపట్లో సీబీఐ కోర్టు తీర్పు వెలువరించే అవకాశముంది.  

ఇదీ చదవండి:

Raghurama: తెలంగాణ హైకోర్టులో ఎంపీ రఘురామ మరో పిటిషన్​.. ఎందుకంటే..

Last Updated : Sep 15, 2021, 11:53 AM IST

ABOUT THE AUTHOR

...view details